Ela vegirimcheve yeedanidoda

ఏల వేగిరించేవె యీతనితోడ
Language

(॥పల్లవి॥)
ఏల వేగిరించేవె యీతనితోడ
మూలలనె వుండనీరె ముచ్చటల మాటా

(॥ఏల॥)
చిత్తము వచ్చినచోట సేసినదె విన్నపము
హత్తి పొసఁగనిచోట ననుమానమె
యిత్తలఁ దన నా సంది యీ రెండుఁ దెలయుదాఁకా
పొత్తులనె వుండ నీరె పొరుగుల మాఁటా

(॥ఏల॥)
ఆస గలిగినచోట నాడినదె సరసము
వేసట లయ్యినచోట విచారములె
వాసితోఁ దనకు నాకు వైపులు గూడినదాఁకా
మూసినట్టె వుండ నీరె ముందరి ఆమాఁటా

(॥ఏల॥)
వొడఁబాటు గలచోల నొనగూడి వుండు నవ్వు
వెడవెడ లైనచోట వేరువేరులె
యెడయక శ్రీవెంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడె
వొడికమైవుండ నీరె వొరపుల మాఁటా

(||pallavi||)
ela vegiriṁchevĕ yīdanidoḍa
mūlalanĕ vuṁḍanīrĕ muchchaḍala māḍā

(||ela||)
sittamu vachchinasoḍa sesinadĕ vinnabamu
hatti pŏsam̐ganisoḍa nanumānamĕ
yittalam̐ dana nā saṁdi yī rĕṁḍum̐ dĕlayudām̐kā
pŏttulanĕ vuṁḍa nīrĕ pŏrugula mām̐ṭā

(||ela||)
āsa galiginasoḍa nāḍinadĕ sarasamu
vesaḍa layyinasoḍa visāramulĕ
vāsidom̐ danagu nāgu vaibulu gūḍinadām̐kā
mūsinaṭṭĕ vuṁḍa nīrĕ muṁdari āmām̐ṭā

(||ela||)
vŏḍam̐bāḍu galasola nŏnagūḍi vuṁḍu navvu
vĕḍavĕḍa lainasoḍa veruverulĕ
yĕḍayaga śhrīvĕṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
vŏḍigamaivuṁḍa nīrĕ vŏrabula mām̐ṭā