Ela vegirimcheene taa nimtalonanu

ఏల వేగిరించీనె తా నింతలోనను
Language

(॥పల్లవి॥)
ఏల వేగిరించీనె తా నింతలోనను
జాలితోఁ బవ్వళించి మంచముపై నుందానను

(॥ఏల॥)
తెల్లవార నియ్యవే తేనె లుట్టిపడేఅట్టు
మల్లాడి తనతో నేను మాటాడేఁ గాని
యిల్లు గడె వెట్టుకొంటి నీపొద్దుకు నోప లేను
పల్లదాన నిదివో నా పక్క బిడ్డ వున్నది

(॥ఏల॥)
చలి వాయ నియ్యరే సరి బేసి ఆడినట్టు
వలపులు తనమీఁద వడిఁ జల్లేను
తలఁ బట్టు వెట్టుకొంటిఁ దతి గా దీవేళను
పొలసి మాయత్త నేఁడు పొరుగింట నున్నది

(॥ఏల॥)
చేగ చేర నియ్యవే చెల్లుబడి గలయట్టు
బాగులుగా తన్ను నేనె పైకొనేను
చేగడియ దీసి చొచ్చి శ్రీవెంకటేశుఁడు గూడె
వేగిరించి మావదినె వెలుపల నున్నది

(||pallavi||)
ela vegiriṁchīnĕ tā niṁtalonanu
jālidom̐ bavvaḽiṁchi maṁchamubai nuṁdānanu

(||ela||)
tĕllavāra niyyave tenĕ luṭṭibaḍeaṭṭu
mallāḍi tanado nenu māḍāḍem̐ gāni
yillu gaḍĕ vĕṭṭugŏṁṭi nībŏddugu noba lenu
palladāna nidivo nā pakka biḍḍa vunnadi

(||ela||)
sali vāya niyyare sari besi āḍinaṭṭu
valabulu tanamīm̐da vaḍim̐ jallenu
talam̐ baṭṭu vĕṭṭugŏṁṭim̐ dadi gā dīveḽanu
pŏlasi māyatta nem̐ḍu pŏrugiṁṭa nunnadi

(||ela||)
sega sera niyyave sĕllubaḍi galayaṭṭu
bāgulugā tannu nenĕ paigŏnenu
segaḍiya dīsi sŏchchi śhrīvĕṁkaḍeśhum̐ḍu gūḍĕ
vegiriṁchi māvadinĕ vĕlubala nunnadi