ఏల వేగిరించ మాకు నింతలోననే
(॥పల్లవి॥)
ఏల వేగిరించ మాకు నింతలోననే
యీ లీల నీ వుంగరము యీడేరించీఁ గాక
(॥॥)
మొక్కలపు వాడవు మొదలనే నీవు
మొక్కి యెంత వేఁడుకొన్నా మొగమోడేవా
కక్కసించ నేమిటికి కాఁపురాలు సేయించే
తెక్కలి మరుఁడే అన్నీఁ దేరిచీఁ గాక
(॥॥)
చలపాది వాఁడవు చాయకుఁ దెచ్చేనని
బలిమెంత సేసినాను బ్రమసేవా
అలమి పట్టి నేఁటికి అందరి బొందులు సేసే
అలరు బాణములే నెయ్యము రేఁచీఁ గాక
(॥॥)
ఆసోదకాఁడవు అన్నిటా శ్రీవేంకటేశ
సేసవెట్టితే నన్నుఁ జెంద కుండేవా
బాసగొన నేఁటికి పై కొన్న వలపులే
రాసికెక్కఁ గూడించే రతులిచ్చీఁ గాకా
(||pallavi||)
ela vegiriṁcha māgu niṁtalonane
yī līla nī vuṁgaramu yīḍeriṁchīm̐ gāga
(||||)
mŏkkalabu vāḍavu mŏdalane nīvu
mŏkki yĕṁta vem̐ḍugŏnnā mŏgamoḍevā
kakkasiṁcha nemiḍigi kām̐purālu seyiṁche
tĕkkali marum̐ḍe annīm̐ derisīm̐ gāga
(||||)
salabādi vām̐ḍavu sāyagum̐ dĕchchenani
balimĕṁta sesinānu bramasevā
alami paṭṭi nem̐ṭigi aṁdari bŏṁdulu sese
alaru bāṇamule nĕyyamu rem̐sīm̐ gāga
(||||)
āsodagām̐ḍavu anniḍā śhrīveṁkaḍeśha
sesavĕṭṭide nannum̐ jĕṁda kuṁḍevā
bāsagŏna nem̐ṭigi pai kŏnna valabule
rāsigĕkkam̐ gūḍiṁche radulichchīm̐ gāgā