ఏల వేగిరపడేరె యింతలో మీరు
(॥పల్లవి॥)
ఏల వేగిరపడేరె యింతలో మీరు
తాలిమి చూపి యతఁడె దయసేసీఁ గాకా
(॥ఏల॥)
చనవు లిచ్చినవాఁడు సరవు లేల తప్పునె
మనసు చూడ వలసి మాయలు గాక
నను పై యుండేవాఁడు నవ్వ కేల మానునె
పెనఁగించుకొని తానె బెరసీఁ గాకా
(॥ఏల॥)
యిచ్చక మాడెటివాఁడు యెగ్గు లేల పట్టునె
ముచ్చట లాడ వలసి మొరఁగీఁ గాక
మెచ్చినట్టివాఁడు మేలు మెరయ కేల మానునె
రచ్చ కెక్కినందాక రాఁపు సేసీఁ గాకా
(॥ఏల॥)
కలసినయట్టివాఁడు కరఁగ కేలు లండునె
అలపు దేరినదాఁకా ఆలించీఁ గాక
యెలమి శ్రీవెంకటేశుఁడిక నేల లోఁచీనె
చెలఁగి తనబాసలు చెల్లించీఁ గాకా
(||pallavi||)
ela vegirabaḍerĕ yiṁtalo mīru
tālimi sūbi yadam̐ḍĕ dayasesīm̐ gāgā
(||ela||)
sanavu lichchinavām̐ḍu saravu lela tappunĕ
manasu sūḍa valasi māyalu gāga
nanu pai yuṁḍevām̐ḍu navva kela mānunĕ
pĕnam̐giṁchugŏni tānĕ bĕrasīm̐ gāgā
(||ela||)
yichchaga māḍĕḍivām̐ḍu yĕggu lela paṭṭunĕ
muchchaḍa lāḍa valasi mŏram̐gīm̐ gāga
mĕchchinaṭṭivām̐ḍu melu mĕraya kela mānunĕ
rachcha kĕkkinaṁdāga rām̐pu sesīm̐ gāgā
(||ela||)
kalasinayaṭṭivām̐ḍu karam̐ga kelu laṁḍunĕ
alabu derinadām̐kā āliṁchīm̐ gāga
yĕlami śhrīvĕṁkaḍeśhum̐ḍiga nela lom̐sīnĕ
sĕlam̐gi tanabāsalu sĕlliṁchīm̐ gāgā