Ela vegirabadeeni yeṟamgamdaa taanemi

ఏల వేగిరపడీని యెఱఁగఁడా తానేమి
Language

(॥పల్లవి॥)
ఏల వేగిరపడీని యెఱఁగఁడా తానేమి
పోలించి యిందాఁకాఁ దన్ను బోదించవలెనా

(॥ఏల॥)
మనసునఁ గలితేను మరి బాససేయనేల
పెనఁగఁ జోటు గలితే ప్రియములేల
తను నమ్మివున్న దాన తగవు దానే యెఱుఁగు
వెనకఁ దగిలి విన్నవించవలెనా

(॥ఏల॥)
వలపు గలిగితేను వాడవారిసాకిరేల
నిలుకడ గలచోట నేరుపులేల
కలసివుందాన నేను కైకొన్నాఁడు తొల్లె తాను
పొలసి సొలసి యింకాఁ జొక్కించవలెనా

(॥ఏల॥)
వేడుకకుఁ బెండ్లాడి వేరెవావి చెప్పనేల
యీడుజొడై వున్నచోట యెన్నికలేల
కూడె శ్రీవేంకటేశుఁడు గొబ్బునఁ దానే నన్ను
మేడెపురతుల నింకా మెప్పించవలెనా

(||pallavi||)
ela vegirabaḍīni yĕṟam̐gam̐ḍā tānemi
poliṁchi yiṁdām̐kām̐ dannu bodiṁchavalĕnā

(||ela||)
manasunam̐ galidenu mari bāsaseyanela
pĕnam̐gam̐ joḍu galide priyamulela
tanu nammivunna dāna tagavu dāne yĕṟum̐gu
vĕnagam̐ dagili vinnaviṁchavalĕnā

(||ela||)
valabu galigidenu vāḍavārisāgirela
nilugaḍa galasoḍa nerubulela
kalasivuṁdāna nenu kaigŏnnām̐ḍu tŏllĕ tānu
pŏlasi sŏlasi yiṁkām̐ jŏkkiṁchavalĕnā

(||ela||)
veḍugagum̐ bĕṁḍlāḍi verĕvāvi sĕppanela
yīḍujŏḍai vunnasoḍa yĕnnigalela
kūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu gŏbbunam̐ dāne nannu
meḍĕburadula niṁkā mĕppiṁchavalĕnā