Ela vegirabadeene yimtalom daanu

ఏల వేగిరపడీనే యింతలోఁ దాను
Language

(॥పల్లవి॥)
ఏల వేగిరపడీనే యింతలోఁ దాను
మేలల్లా నొకరూపైన మెచ్చులాఁడు గాఁడా

(॥ఏల॥)
అలిగి మాఁటాడనంటా అందుకే తా వేఁడుకొనీ
తలఁపులోఁ దలఁపది తన్నునే కాదా
పిలిచి పేర్కొన నంటా ప్రియములు చెప్పీని
తలకొన్న పాటలలో తనముద్ర కాదా

(॥ఏల॥)
మొగమిచ్చి చూడనంటా మోహములు చల్లీని
తగిన నా వయసెల్లా తనకే కాదా
నగనంటా నటు నిటు ననుపులు పచరించీ
తెగడే సరసాలలో తేటలు తాఁగాఁడా

(॥ఏల॥)
నేనే పై కొననంటా నెయ్యములు ముంచీని
నానిన తన కాఁగిలే నాది గాదా
తానే శ్రీ వేంకటేశుఁడు నే నలమేలుమంగను
కానుక యీ రతులెల్లా కతలై నిలువవా

(||pallavi||)
ela vegirabaḍīne yiṁtalom̐ dānu
melallā nŏgarūbaina mĕchchulām̐ḍu gām̐ḍā

(||ela||)
aligi mām̐ṭāḍanaṁṭā aṁduge tā vem̐ḍugŏnī
talam̐pulom̐ dalam̐padi tannune kādā
pilisi pergŏna naṁṭā priyamulu sĕppīni
talagŏnna pāḍalalo tanamudra kādā

(||ela||)
mŏgamichchi sūḍanaṁṭā mohamulu sallīni
tagina nā vayasĕllā tanage kādā
naganaṁṭā naḍu niḍu nanubulu pasariṁchī
tĕgaḍe sarasālalo teḍalu tām̐gām̐ḍā

(||ela||)
nene pai kŏnanaṁṭā nĕyyamulu muṁchīni
nānina tana kām̐gile nādi gādā
tāne śhrī veṁkaḍeśhum̐ḍu ne nalamelumaṁganu
kānuga yī radulĕllā kadalai niluvavā