Ela vattijoli sese vemigattugomti vimdu

ఏల వట్టిజోలి సేసే వేమిగట్టుకొంటి విందు
Language

(॥పల్లవి॥)
ఏల వట్టిజోలి సేసే వేమిగట్టుకొంటి విందు
కాలమందె యీమేలు గట్టుకొనరాదా

(॥॥)
వండవండనట్లాయ వలచినతరితీపు
యెండమావులాయ నీపై నెచ్చిన యాస
వుండ దీయాసలఁ జెలి వొగి నే వచ్చినదాఁకా
అండనే ఇంకొకమాట ఆనతియ్యరాదా

(॥॥)
పుచ్చఁబుచ్చ పున్నమాయ పూఁచిననీసరసాలు
వచ్చీరానిపాటలాయ వట్టిప్రియాలు
ఇచ్చల నే వచ్చేనంటా నిందుకే కాచుకున్నది
అచ్చముగ నన్ను నాడ కంపివిడరాదా

(॥॥)
వూరవూర నూటలాయ వొప్పగు నీమోవితేనె
చేరఁజేరఁజేరువాయ చెలికాఁగిలి
యీరీతి శ్రీవేంకటేశ ఇద్దరుఁ గూడితి రీడ
సారెకు నీపొందు లిట్టే జరపఁగరాదా

(||pallavi||)
ela vaṭṭijoli sese vemigaṭṭugŏṁṭi viṁdu
kālamaṁdĕ yīmelu gaṭṭugŏnarādā

(||||)
vaṁḍavaṁḍanaṭlāya valasinadaridību
yĕṁḍamāvulāya nībai nĕchchina yāsa
vuṁḍa dīyāsalam̐ jĕli vŏgi ne vachchinadām̐kā
aṁḍane iṁkŏgamāḍa ānadiyyarādā

(||||)
puchcham̐buchcha punnamāya pūm̐sinanīsarasālu
vachchīrānibāḍalāya vaṭṭipriyālu
ichchala ne vachchenaṁṭā niṁduge kāsugunnadi
achchamuga nannu nāḍa kaṁpiviḍarādā

(||||)
vūravūra nūḍalāya vŏppagu nīmovidenĕ
seram̐jeram̐jeruvāya sĕligām̐gili
yīrīdi śhrīveṁkaḍeśha iddarum̐ gūḍidi rīḍa
sārĕgu nībŏṁdu liṭṭe jarabam̐garādā