ఏల వంకలు దిద్దేరే యీతని లాగెఱఁగరు
(॥పల్లవి॥)
ఏల వంకలు దిద్దేరే యీతని లాగెఱఁగరు
యేలాటము లాడేవి యెఱఁగరాదా
(॥ఏల॥)
నగుతానే రమణుఁడు నాలినే పొద్దు గడసీ
యెగసక్కెములు సేసే దెఱఁగరాదా
మొగము చూడఁగానే మొనగోర నూఁదీ యాస
లిగిరించఁ జేసేది యెఱఁగరాదా
(॥ఏల॥)
సుదతుల నీడువెట్టి సూడుఁబాడుఁ బట్టించిన
యెదలోనిమర్మము లెఱఁగరాదా
అదనులు చెప్పించి అట్టె తనరాకకు
యెదురులుచూపించే దెఱఁగరాదా
(॥ఏల॥)
చొక్కుచుఁగాంగిట నించి సురతము చవిచూపీ
యెక్కువల కెలఇంచే దెఱఁగరాదా
చక్కనిశ్రీవేంకటేశ్వరుఁడిదె నను నేలె
యిక్కడనే వుండినది యెఱఁగరాదా
(||pallavi||)
ela vaṁkalu diddere yīdani lāgĕṟam̐garu
yelāḍamu lāḍevi yĕṟam̐garādā
(||ela||)
nagudāne ramaṇum̐ḍu nāline pŏddu gaḍasī
yĕgasakkĕmulu sese dĕṟam̐garādā
mŏgamu sūḍam̐gāne mŏnagora nūm̐dī yāsa
ligiriṁcham̐ jesedi yĕṟam̐garādā
(||ela||)
sudadula nīḍuvĕṭṭi sūḍum̐bāḍum̐ baṭṭiṁchina
yĕdalonimarmamu lĕṟam̐garādā
adanulu sĕppiṁchi aṭṭĕ tanarāgagu
yĕdurulusūbiṁche dĕṟam̐garādā
(||ela||)
sŏkkusum̐gāṁgiḍa niṁchi suradamu savisūbī
yĕkkuvala kĕla̮iṁche dĕṟam̐garādā
sakkaniśhrīveṁkaḍeśhvarum̐ḍidĕ nanu nelĕ
yikkaḍane vuṁḍinadi yĕṟam̐garādā