Ela vaasu lekkimchevu yeragavaa neevemainaa

ఏల వాసు లెక్కించేవు యెరగవా నీవేమైనా
Language

(॥పల్లవి॥)
ఏల వాసు లెక్కించేవు యెరగవా నీవేమైనా
గేలి సేసితే నేమైనాఁ గేరడమే కాదా

(॥ఏల॥)
పంతమాడరాదుగాక బలువైన నా చన్నులు
యెంతటి కొండలకైనా యెక్కడే కాదా
వంతుపెట్టరాదు గాక వాఁడినా కనుచూపులు
కంతునియమ్ములకంటె కడు వాండిగావా

(॥ఏల॥)
సరిపెట్టరాదుగాక సంతతము నాతురుము
గరిమ జీంకటికంటె ఘనమే కాదా
పురుడించరాదుగాక పొందైన నాకరములు
పొరిఁ దిగెలకంటె నబ్బురములే కావా

(॥ఏల॥)
రట్టు సేయరాదుగాక గుట్టున నాపిరుఁదులు
తొట్టి పులినాలకంటె దొడ్డలే కావా
ఇట్టె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
నెట్టన మనసొందులు నేరుపులే కావా

(||pallavi||)
ela vāsu lĕkkiṁchevu yĕragavā nīvemainā
geli seside nemainām̐ geraḍame kādā

(||ela||)
paṁtamāḍarādugāga baluvaina nā sannulu
yĕṁtaḍi kŏṁḍalagainā yĕkkaḍe kādā
vaṁtubĕṭṭarādu gāga vām̐ḍinā kanusūbulu
kaṁtuniyammulagaṁṭĕ kaḍu vāṁḍigāvā

(||ela||)
saribĕṭṭarādugāga saṁtadamu nādurumu
garima jīṁkaḍigaṁṭĕ ghaname kādā
puruḍiṁcharādugāga pŏṁdaina nāgaramulu
pŏrim̐ digĕlagaṁṭĕ nabburamule kāvā

(||ela||)
raṭṭu seyarādugāga guṭṭuna nābirum̐dulu
tŏṭṭi pulinālagaṁṭĕ dŏḍḍale kāvā
iṭṭĕ śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
nĕṭṭana manasŏṁdulu nerubule kāvā