ఏల తిట్టు దిట్టేవు ఎవ్వరి దపరాధము
(॥పల్లవి॥)
ఏల తిట్టు దిట్టేవు ఎవ్వరి దపరాధము
మూలలవారి చన్నులు ముట్టి తియ్యఁగాను
(॥ఏల॥)
చెక్కులు నొక్కె నొకతె జీరలుదీసె నొకతె
చక్కనిగొల్లెతలతో సాముసేయగా
తొక్కెఁ బాదాన నొక్కతె దొమ్మిసేసె మరొకతె
వుక్కున వారిండ్లలోనివు ట్లెక్కగాను
(॥ఏల॥)
చన్నుల నొత్తె నొకతె చప్పరించె మోవొకతె
పన్ని గొల్లవారి నీవు బండుసేయగా
సన్నల దూరె నొకతె చలము రేఁచె నొకతె
పన్నుగ వారిచీరలు పట్టితియ్యఁగాను
(॥ఏల॥)
కైకొని పట్టె నొకతె కందువఁ గూడె నొకతె
జోకతో మందలవారి సోదించఁగా
ఆకడ శ్రీవేంకటేశ అలయించె నిన్నొకతె
దీకొని వారి బలిమిఁ దీసి కూడఁగాను
(||pallavi||)
ela tiṭṭu diṭṭevu ĕvvari dabarādhamu
mūlalavāri sannulu muṭṭi tiyyam̐gānu
(||ela||)
sĕkkulu nŏkkĕ nŏgadĕ jīraludīsĕ nŏgadĕ
sakkanigŏllĕdalado sāmuseyagā
tŏkkĕm̐ bādāna nŏkkadĕ dŏmmisesĕ marŏgadĕ
vukkuna vāriṁḍlalonivu ṭlĕkkagānu
(||ela||)
sannula nŏttĕ nŏgadĕ sappariṁchĕ movŏgadĕ
panni gŏllavāri nīvu baṁḍuseyagā
sannala dūrĕ nŏgadĕ salamu rem̐sĕ nŏgadĕ
pannuga vārisīralu paṭṭidiyyam̐gānu
(||ela||)
kaigŏni paṭṭĕ nŏgadĕ kaṁduvam̐ gūḍĕ nŏgadĕ
jogado maṁdalavāri sodiṁcham̐gā
āgaḍa śhrīveṁkaḍeśha alayiṁchĕ ninnŏgadĕ
dīgŏni vāri balimim̐ dīsi kūḍam̐gānu