ఏల తిట్టేవే నన్ను నెంత గబ్బిదాననే
(॥పల్లవి॥)
ఏల తిట్టేవే నన్ను నెంత గబ్బిదాననే
మే లని పొగడితేను మెచ్చ వద్దా నీవూ
(॥ఏల॥)
చిక్కని వెన్నెలతేట సెలవినె వుండఁ గాను
చక్కని నీ మోమునె చంద్రుడు డంటినే
నిక్కి నిక్కి మూతు లెత్తి నీ మొగాన కెగరఁగా
జక్కవపిట్టలు నీ చన్ను లంటినే
(॥ఏల॥)
కామించి మురిపెముతోఁ గదలుచు నుండఁ గాను
రామ నీపిరుఁదు మరురథ మంటినే
కోమలపుఁ బోలికలు గురుతులు చూపఁ గాను
తామెరలనె పాదాలు తగ నంటివే
(॥ఏల॥)
జాతిమెఱుఁగులతోడ సరివచ్చి వుండఁగాను
నీతురుమె రాశి యైల నీలా లంటినే
నీతితో నన్నుఁ గూడితి నేను శ్రీవెంకటేశుఁడ
నీతనువె బంగారునెల వంటినే
(||pallavi||)
ela tiṭṭeve nannu nĕṁta gabbidānane
me lani pŏgaḍidenu mĕchcha vaddā nīvū
(||ela||)
sikkani vĕnnĕladeḍa sĕlavinĕ vuṁḍam̐ gānu
sakkani nī momunĕ saṁdruḍu ḍaṁṭine
nikki nikki mūdu lĕtti nī mŏgāna kĕgaram̐gā
jakkavabiṭṭalu nī sannu laṁṭine
(||ela||)
kāmiṁchi muribĕmudom̐ gadalusu nuṁḍam̐ gānu
rāma nībirum̐du maruratha maṁṭine
komalabum̐ boligalu gurudulu sūbam̐ gānu
tāmĕralanĕ pādālu taga naṁṭive
(||ela||)
jādimĕṟum̐guladoḍa sarivachchi vuṁḍam̐gānu
nīdurumĕ rāśhi yaila nīlā laṁṭine
nīdido nannum̐ gūḍidi nenu śhrīvĕṁkaḍeśhum̐ḍa
nīdanuvĕ baṁgārunĕla vaṁṭine