Ela tappimchugonevu itte naa kaamgidi numdi

ఏల తప్పించుకొనేవు ఇట్టె నా కాఁగిటి నుండి
Language

(॥పల్లవి॥)
ఏల తప్పించుకొనేవు ఇట్టె నా కాఁగిటి నుండి
యేలితివి నే నీకిటు మొక్కరాదా

(॥॥)
పంతమాడరాదుగాక బ త్తితోడ నే నీకు
చెంతనుండి వూడిగాలు సేయఁగరాదా
రంతుతోడఁ గడుదూరరాదుగాక వేడుకతో
సంతతము నీమేను చన్నుల నొత్తరాదా

(॥॥)
జంకించవలదుగాక సరుసఁ బానుపుమీఁద
కొంకక నీపాదములు గుద్దఁగరాదా
మంకు చూపవద్దుగాక మంతనాన సారెసారె
కింకలేక నీమోవియెంగిలి యానరాదా

(॥॥)
అలుగఁదగదుగాక ఆసల నీతో గూడి
సొలసి నిన్ను రతులఁ జొక్కించరాదా
యెలమి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
బెళకకేపొద్దూఁ బ్రేమఁ బెనఁగఁగరాదా

(||pallavi||)
ela tappiṁchugŏnevu iṭṭĕ nā kām̐giḍi nuṁḍi
yelidivi ne nīgiḍu mŏkkarādā

(||||)
paṁtamāḍarādugāga ba ttidoḍa ne nīgu
sĕṁtanuṁḍi vūḍigālu seyam̐garādā
raṁtudoḍam̐ gaḍudūrarādugāga veḍugado
saṁtadamu nīmenu sannula nŏttarādā

(||||)
jaṁkiṁchavaladugāga sarusam̐ bānubumīm̐da
kŏṁkaga nībādamulu guddam̐garādā
maṁku sūbavaddugāga maṁtanāna sārĕsārĕ
kiṁkalega nīmoviyĕṁgili yānarādā

(||||)
alugam̐dagadugāga āsala nīdo gūḍi
sŏlasi ninnu radulam̐ jŏkkiṁcharādā
yĕlami śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
bĕḽagagebŏddūm̐ bremam̐ bĕnam̐gam̐garādā