Ela tannu doorenu ikkadigi rammanave

ఏల తన్ను దూరేను ఇక్కడికి రమ్మనవే
Language

(॥పల్లవి॥)
ఏల తన్ను దూరేను ఇక్కడికి రమ్మనవే
తాలిమి గలిగితేను దయవుట్టుఁ గాక

(॥ఏల॥)
ఇచ్చకము లాడితేను ఇందు రమ్మందును గాక
కొచ్చి వెంగేలాడితేను కూడునా పొందు
వచ్చినట్టే వచ్చితేను వలపు చవౌఁగాక
యెచ్చుకుందై పెనఁగితే నెరవులే కావా

(॥ఏల॥)
వినయముతో మొక్కితే వేడుకలు వుట్టుఁగాక
వొనరనియడియాస లొద్దిక లౌనా
ననపుతో నవ్వితేను నాఁటుఁగాక ప్రియములు
మనసురాని పనులు మరి ఇంపులౌనా

(॥ఏల॥)
బత్తిసేసి పిలిచితే భావము గరఁగుఁగాక
వొత్తు కోళ్లైనరతు లొడఁబడీనా
ఇత్తల శ్రీ వేంకటేశుఁ డేలినాఁడు నన్నుఁ దానె
హత్తి ఇంత లేకుండితే నాటపాట వలపు

(||pallavi||)
ela tannu dūrenu ikkaḍigi rammanave
tālimi galigidenu dayavuṭṭum̐ gāga

(||ela||)
ichchagamu lāḍidenu iṁdu rammaṁdunu gāga
kŏchchi vĕṁgelāḍidenu kūḍunā pŏṁdu
vachchinaṭṭe vachchidenu valabu savaum̐gāga
yĕchchuguṁdai pĕnam̐gide nĕravule kāvā

(||ela||)
vinayamudo mŏkkide veḍugalu vuṭṭum̐gāga
vŏnaraniyaḍiyāsa lŏddiga launā
nanabudo navvidenu nām̐ṭum̐gāga priyamulu
manasurāni panulu mari iṁpulaunā

(||ela||)
battisesi piliside bhāvamu garam̐gum̐gāga
vŏttu koḽlainaradu lŏḍam̐baḍīnā
ittala śhrī veṁkaḍeśhum̐ ḍelinām̐ḍu nannum̐ dānĕ
hatti iṁta leguṁḍide nāḍabāḍa valabu