Ela tamagimchevu yimtalom dappina demi

ఏల తమకించేవు యింతలోఁ దప్పిన దేమి
Language

(॥పల్లవి॥)
ఏల తమకించేవు యింతలోఁ దప్పిన దేమి
ఆలికిఁ బంపుసేసితే నందరును నవ్వరా

(॥ఏల॥)
పంతములాడినయాకె పలుక కుండీనా
రంతులఁ దిట్టినయాకె రాకుంతునా
యింతలోనె నీవు లోఁగి యేల ప్రియాలు చెప్పేవు
కాంతకుఁ గిందుపడితే కడవారు నవ్వరా

(॥ఏల॥)
మారుకొని వుండినాపె మాటలాడకుండీనా
బీరమాడినాపె ప్రేమ నెంచకుండీనా
ఆరీతి యిందుకునేల అట్టె కాఁతాళించేవు
కోరి సతికి బంటైతే కొమ్మలెల్ల నవ్వరా

(॥ఏల॥)
అలుకదేరినయాపె అట్టె కూడకుండీనా
కలసె నిన్నాపె ఇఁకఁ గాదనీనా
యెలమి శ్రీవేంకటేశ యిట్టె నన్ను నేలితివి
తొలుతాపెకు మొక్కితే దొడ్డివారు నవ్వరా

(||pallavi||)
ela tamagiṁchevu yiṁtalom̐ dappina demi
āligim̐ baṁpuseside naṁdarunu navvarā

(||ela||)
paṁtamulāḍinayāgĕ paluga kuṁḍīnā
raṁtulam̐ diṭṭinayāgĕ rāguṁtunā
yiṁtalonĕ nīvu lom̐gi yela priyālu sĕppevu
kāṁtagum̐ giṁdubaḍide kaḍavāru navvarā

(||ela||)
mārugŏni vuṁḍinābĕ māḍalāḍaguṁḍīnā
bīramāḍinābĕ prema nĕṁchaguṁḍīnā
ārīdi yiṁdugunela aṭṭĕ kām̐tāḽiṁchevu
kori sadigi baṁṭaide kŏmmalĕlla navvarā

(||ela||)
alugaderinayābĕ aṭṭĕ kūḍaguṁḍīnā
kalasĕ ninnābĕ im̐kam̐ gādanīnā
yĕlami śhrīveṁkaḍeśha yiṭṭĕ nannu nelidivi
tŏludābĕgu mŏkkide dŏḍḍivāru navvarā