Ela tamagimcheve yimtiro neevu

ఏల తమకించేవే యింతిరో నీవు
Language

(॥పల్లవి॥)
ఏల తమకించేవే యింతిరో నీవు
వాలాయించి యెప్పడూ నీవద్ద నున్నాఁ డితఁడు

(॥ఏల॥)
చిన్నఁబోయి యుండకువే చెలియ నీవు
మన్నించీ నాతఁడు నిన్ను మచ్చికతోను
యిన్నేసి నివ్వెరగులు యేఁటికే నీకు
పన్ని యెప్పడూ నీపై బత్తిగలఁ డితఁడు

(॥ఏల॥)
తల వంచుకొనకువే తరుణి నీవు
పిలువక తొల్లే వచ్చీఁ బ్రియముతోను
యెలమిఁ జెక్కిటి చెయ్యేఁటికే నీకు
మలసి యెప్పడూ నీకు మరిగినాఁగితఁడు

(॥ఏల॥)
వసివాడకువే లోలో వనిత నీవు
యెసగ శ్రీవేంకటేశుఁ డేలెను నిన్ను
యిసుమంత చిరుసిగ్గు లేఁటికే నీకు
వసమై యెప్పడూ నీకు వలచినాఁ డితఁడు

(||pallavi||)
ela tamagiṁcheve yiṁtiro nīvu
vālāyiṁchi yĕppaḍū nīvadda nunnām̐ ḍidam̐ḍu

(||ela||)
sinnam̐boyi yuṁḍaguve sĕliya nīvu
manniṁchī nādam̐ḍu ninnu machchigadonu
yinnesi nivvĕragulu yem̐ṭige nīgu
panni yĕppaḍū nībai battigalam̐ ḍidam̐ḍu

(||ela||)
tala vaṁchugŏnaguve taruṇi nīvu
piluvaga tŏlle vachchīm̐ briyamudonu
yĕlamim̐ jĕkkiḍi sĕyyem̐ṭige nīgu
malasi yĕppaḍū nīgu mariginām̐gidam̐ḍu

(||ela||)
vasivāḍaguve lolo vanida nīvu
yĕsaga śhrīveṁkaḍeśhum̐ ḍelĕnu ninnu
yisumaṁta sirusiggu lem̐ṭige nīgu
vasamai yĕppaḍū nīgu valasinām̐ ḍidam̐ḍu