ఏల తమకించేవే యెరఁగవా యీ కతలు
(॥పల్లవి॥)
ఏల తమకించేవే యెరఁగవా యీ కతలు
కోలుముందై తిట్టు నొండె గోరనైనా గీరును
(॥॥)
మగవానితోఁ బలుమరు మాటలాడఁ బోతే
వొగరులాడును వొండె వొడివట్టును
నగవులు వచరించి ననుపు నటించఁ బోతే
మొగిఁ బరాకౌ నొండె మోనాన నుండును
(॥॥)
వచ్చి వచ్చి నిజముగా వలపులు చల్లఁ బోతే
రచ్చ నాడుకొను నొండె రాఁపుసేసును
ఇచ్చకము సేసి కడునింపులు చూపఁగబోతే
తచ్చనలు చూపు నొండ తరితీపుసేసును
(॥॥)
బలిమిఁ గాఁగిట నించి పట్టి పెనఁగఁగబోతే
చలమైనా రేఁచు నొండె సన్నైనాఁ జేసు
యెలమి శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
వెలయ మన్నించు నొండె వేడుకైనా వించును
(||pallavi||)
ela tamagiṁcheve yĕram̐gavā yī kadalu
kolumuṁdai tiṭṭu nŏṁḍĕ goranainā gīrunu
(||||)
magavānidom̐ balumaru māḍalāḍam̐ bode
vŏgarulāḍunu vŏṁḍĕ vŏḍivaṭṭunu
nagavulu vasariṁchi nanubu naḍiṁcham̐ bode
mŏgim̐ barāgau nŏṁḍĕ monāna nuṁḍunu
(||||)
vachchi vachchi nijamugā valabulu sallam̐ bode
rachcha nāḍugŏnu nŏṁḍĕ rām̐pusesunu
ichchagamu sesi kaḍuniṁpulu sūbam̐gabode
tachchanalu sūbu nŏṁḍa taridībusesunu
(||||)
balimim̐ gām̐giḍa niṁchi paṭṭi pĕnam̐gam̐gabode
salamainā rem̐su nŏṁḍĕ sannainām̐ jesu
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐ gūḍĕ
vĕlaya manniṁchu nŏṁḍĕ veḍugainā viṁchunu