Ela tamagimchevayyaa imtalo neevu

ఏల తమకించేవయ్యా ఇంతలో నీవు
Language

(॥పల్లవి॥)
ఏల తమకించేవయ్యా ఇంతలో నీవు
మేలిమి సగినములు మించీని యెదుటను

(॥ఏల॥)
ఆలులఁ జూడవయ్యా అంగనతురుముమారు
చెలఁగి యద్దాలఁ జూడు చెక్కులమారు
అల చందురునిఁ జూడు మాకెమొగముమారు
అలుకదేరె నాకె నీయండకు వచ్చీని

(॥ఏల॥)
చిగురులు చూడవయ్య చెలియధరముమారు
తగులతలఁ జూడు హస్తములమారు
సొగిసి జక్కవలనుఁ జూడు కుచములమారు
మగువ తెరదీసి నెమ్మది నిన్నుఁ గూడీని

(॥ఏల॥)
హత్తి తామరలఁ జూడు మమురుఁబాదాలమారు
పుత్తడిబొమ్మఁ జూడు పొలిఁతిమారు
ఇత్తల శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
బత్తితోఁ గలసె నింకఁ బాయకవుండీని

(||pallavi||)
ela tamagiṁchevayyā iṁtalo nīvu
melimi saginamulu miṁchīni yĕduḍanu

(||ela||)
ālulam̐ jūḍavayyā aṁganadurumumāru
sĕlam̐gi yaddālam̐ jūḍu sĕkkulamāru
ala saṁdurunim̐ jūḍu māgĕmŏgamumāru
alugaderĕ nāgĕ nīyaṁḍagu vachchīni

(||ela||)
sigurulu sūḍavayya sĕliyadharamumāru
taguladalam̐ jūḍu hastamulamāru
sŏgisi jakkavalanum̐ jūḍu kusamulamāru
maguva tĕradīsi nĕmmadi ninnum̐ gūḍīni

(||ela||)
hatti tāmaralam̐ jūḍu mamurum̐bādālamāru
puttaḍibŏmmam̐ jūḍu pŏlim̐timāru
ittala śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
battidom̐ galasĕ niṁkam̐ bāyagavuṁḍīni