(॥పల్లవి॥)
ఏల తమకముసేసే వింతలోను
లాలించినానుఁ జెప్పవు లాఁతిదానివలెను
(॥॥)
నిక్కి చూచినదానవు నీవో మరొకతో
యిక్కువతోఁ జెప్పరాదా యెరిఁగేఁగాని
వుక్కున నీవప్పుడేతే వూఁకొంటివి నేఁ జెప్పితే
వెక్కసాన నుందానవు వింతదానివలెను
(॥॥)
కూరిమిఁ బాడినది నీకుత్తికో వేరొకతో
మేరతోడఁ దెలుపరాదా మెచ్చేఁగాని
చేరి నేఁ బొగడితేను చెలరేఁగితి వప్పుడు
బీరాన గుట్టుసేసేవు పెరదానివలెను
(॥॥)
చెంది కాఁగిలించేవి నీచేతులో చెల్లెలివో
మందలించరాదా సమ్మతించేఁగాని
అంది శ్రీవేంకటేశుఁడ నని కూడితి విప్పుడు
యెందుకైనా నొనగూడే వింటిదానివలెను
(||pallavi||)
ela tamagamusese viṁtalonu
lāliṁchinānum̐ jĕppavu lām̐tidānivalĕnu
(||||)
nikki sūsinadānavu nīvo marŏgado
yikkuvadom̐ jĕpparādā yĕrim̐gem̐gāni
vukkuna nīvappuḍede vūm̐kŏṁṭivi nem̐ jĕppide
vĕkkasāna nuṁdānavu viṁtadānivalĕnu
(||||)
kūrimim̐ bāḍinadi nīguttigo verŏgado
meradoḍam̐ dĕlubarādā mĕchchem̐gāni
seri nem̐ bŏgaḍidenu sĕlarem̐gidi vappuḍu
bīrāna guṭṭusesevu pĕradānivalĕnu
(||||)
sĕṁdi kām̐giliṁchevi nīsedulo sĕllĕlivo
maṁdaliṁcharādā sammadiṁchem̐gāni
aṁdi śhrīveṁkaḍeśhum̐ḍa nani kūḍidi vippuḍu
yĕṁdugainā nŏnagūḍe viṁṭidānivalĕnu