Ela tamagabadeve yemtige yimta

ఏల తమకపడేవే యేఁటికే యింత
Language

(॥పల్లవి॥)
ఏల తమకపడేవే యేఁటికే యింత
కోలుముందై వలచితే గుదిగొనవలదా

(॥ఏల॥)
తాలిమిగలదానికి తనంతనే వచ్చు మేలు
ఆలరి కత్తెకుఁ గద్దా ఆపసోపాలు
బేలనై నే నుండఁగాను పిలువకేవచ్చె పతి
వీవి కాతాళించుకొంటా వెంటనే వచ్చితివి

(॥ఏల॥)
గుట్టు గలదానికి కోరినట్టల్లా నవును
రట్టడించితిఁ గద్దా యిట్టి రారాఁపు
కట్టఁగడ నే నుండఁగా కరుణించె నన్నితఁడు
వెట్టమాఁటలాడుకొంటా వెంటనే వచ్చితివి

(॥ఏల॥)
కగ్గులేనిదానికి కైవశమౌఁ బనులెల్లా
కిగ్గాడిదానికిఁ గద్దా కీసకాట్లు
సిగ్గుతో నే నుండఁగాను శ్రీ వేంకటేశుఁడు గూడె
వెగ్గళించి దూరుకొంటా వెంటనే వచ్చితివి

(||pallavi||)
ela tamagabaḍeve yem̐ṭige yiṁta
kolumuṁdai valaside gudigŏnavaladā

(||ela||)
tālimigaladānigi tanaṁtane vachchu melu
ālari kattĕgum̐ gaddā ābasobālu
belanai ne nuṁḍam̐gānu piluvagevachchĕ padi
vīvi kādāḽiṁchugŏṁṭā vĕṁṭane vachchidivi

(||ela||)
guṭṭu galadānigi korinaṭṭallā navunu
raṭṭaḍiṁchidim̐ gaddā yiṭṭi rārām̐pu
kaṭṭam̐gaḍa ne nuṁḍam̐gā karuṇiṁchĕ nannidam̐ḍu
vĕṭṭamām̐ṭalāḍugŏṁṭā vĕṁṭane vachchidivi

(||ela||)
kaggulenidānigi kaivaśhamaum̐ banulĕllā
kiggāḍidānigim̐ gaddā kīsagāṭlu
siggudo ne nuṁḍam̐gānu śhrī veṁkaḍeśhum̐ḍu gūḍĕ
vĕggaḽiṁchi dūrugŏṁṭā vĕṁṭane vachchidivi