Ela talavamchugonee nemtigi sigguvadeeni

ఏల తలవంచుకొనీ నేఁటికి సిగ్గువడీని
Language

(॥పల్లవి॥)
ఏల తలవంచుకొనీ నేఁటికి సిగ్గువడీని
వాలాయమైనప్పుడు నావద్ద నుండనీవే

(॥ఏల॥)
వినయమే నేఁజేసే వెంగెము లేమీ నాడ
మనసు వచ్చినపుడు మన్నించనీవే
ననుపున నవ్వేను నమ్మిక లేమీ నడుగ
పని గలప్పుడు నన్నుఁ బాలించనీవే

(॥ఏల॥)
వలపులే పైఁజల్లే వాసివంతు లేమీ నెంచ
తలఁపు లోఁగలితేను తానే రానీవే
కొలువులు సేసేను కోపగించ నెంతైనను
మలసి తా వచ్చినవాఁడు మాటలాడనీవే

(॥ఏల॥)
జంపైన గుబ్బలనొత్తే సాదించి నేఁ దను దూర-
నింటికాడ ననుఁ గూడె నిట్టె కానీవే
నంటున మొక్కేను నేను నాటించఁ గొనగోరు
దంట శ్రీవేంకటేశుఁడు తగులనీవే

(||pallavi||)
ela talavaṁchugŏnī nem̐ṭigi sigguvaḍīni
vālāyamainappuḍu nāvadda nuṁḍanīve

(||ela||)
vinayame nem̐jese vĕṁgĕmu lemī nāḍa
manasu vachchinabuḍu manniṁchanīve
nanubuna navvenu nammiga lemī naḍuga
pani galappuḍu nannum̐ bāliṁchanīve

(||ela||)
valabule paim̐jalle vāsivaṁtu lemī nĕṁcha
talam̐pu lom̐galidenu tāne rānīve
kŏluvulu sesenu kobagiṁcha nĕṁtainanu
malasi tā vachchinavām̐ḍu māḍalāḍanīve

(||ela||)
jaṁpaina gubbalanŏtte sādiṁchi nem̐ danu dūra-
niṁṭigāḍa nanum̐ gūḍĕ niṭṭĕ kānīve
naṁṭuna mŏkkenu nenu nāḍiṁcham̐ gŏnagoru
daṁṭa śhrīveṁkaḍeśhum̐ḍu tagulanīve