Ela talavamchugone vedurugattugu raave

ఏల తలవంచుకొనే వెదురుకట్టుకు రావే
Language

(॥పల్లవి॥)
ఏల తలవంచుకొనే వెదురుకట్టుకు రావే
నాలితో సిగ్గుపడితే ననుపులయ్యీనా

(॥॥)
సరసములాడఁగానే చవులుపట్టీఁగాక
విరసాన నుండితేను వేడుకయ్యీనా
సరుసఁ గూచుండఁగానే సమేళము లౌఁగాక
యెరవై మాఁటుననుంటే ఇంపులు వుట్టీనా

(॥॥)
వొనర మాటాడితేవే మనసు గరఁగుఁగాక
మునుపే వెంగెమాడితె ముచ్చటారునా
చెనకి పైకొంటేను చెల్లుబడి యౌఁగాక
పెనఁగి బిగిసితేను ప్రియములయ్యీనా

(॥॥)
కలకల నవ్వఁగానే ఘనత లీడేరుఁగాక
చలము సాదించితేను సమ్మతమయ్యీనా
యెలమి శ్రీ వేంకటేశుఁ డింతలో నిన్ను నేలె
కలసీఁగాక చుట్టరికము లిఁక వీడునా

(||pallavi||)
ela talavaṁchugŏne vĕdurugaṭṭugu rāve
nālido siggubaḍide nanubulayyīnā

(||||)
sarasamulāḍam̐gāne savulubaṭṭīm̐gāga
virasāna nuṁḍidenu veḍugayyīnā
sarusam̐ gūsuṁḍam̐gāne sameḽamu laum̐gāga
yĕravai mām̐ṭunanuṁṭe iṁpulu vuṭṭīnā

(||||)
vŏnara māḍāḍideve manasu garam̐gum̐gāga
munube vĕṁgĕmāḍidĕ muchchaḍārunā
sĕnagi paigŏṁṭenu sĕllubaḍi yaum̐gāga
pĕnam̐gi bigisidenu priyamulayyīnā

(||||)
kalagala navvam̐gāne ghanada līḍerum̐gāga
salamu sādiṁchidenu sammadamayyīnā
yĕlami śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalo ninnu nelĕ
kalasīm̐gāga suṭṭarigamu lim̐ka vīḍunā