Ela talavamcheene yeggulela pamcheenee

ఏల తలవంచీనే యెగ్గులేల పంచీనీ
Language

(॥పల్లవి॥)
ఏల తలవంచీనే యెగ్గులేల పంచీనీ
తాలిమి నెంచి చూచితే తానే నేననవే

(॥॥)
వొడివట్టి పెనఁగవే వొట్టు వెట్టుకున్నవాఁడు
నుడిగి దోసము లేదనుచుఁ బల్కవే
అడియాలమైనట్టియాన నాపైఁ బెట్టవే
వొడయఁడు తాను నాకు వోరుచుకొమ్మనవే

(॥॥)
పలుమారు మొక్కవే పంతముతో నున్నవాఁడు
వెలయ సిగ్గు లొల్లనే విడిపించమనవే
సెలవుల నవ్వింపించి చేరి యాసపుట్టించవే
అలుగరానిచుట్టరిక మన్నిటాఁ దెలుపవే

(॥॥)
గక్కనఁ దెరవేయవే కరుణతో నున్నవాఁడు
అక్కడిక్కడివా రేమీ ననకనవే
యిక్కువ శ్రీ వేంకటేశుఁ డీడ నిట్టె నన్నుఁ గూడె
దక్కినాఁడు తా నాకు తా నెఱుఁగుననవే

(||pallavi||)
ela talavaṁchīne yĕggulela paṁchīnī
tālimi nĕṁchi sūside tāne nenanave

(||||)
vŏḍivaṭṭi pĕnam̐gave vŏṭṭu vĕṭṭugunnavām̐ḍu
nuḍigi dosamu ledanusum̐ balgave
aḍiyālamainaṭṭiyāna nābaim̐ bĕṭṭave
vŏḍayam̐ḍu tānu nāgu vorusugŏmmanave

(||||)
palumāru mŏkkave paṁtamudo nunnavām̐ḍu
vĕlaya siggu lŏllane viḍibiṁchamanave
sĕlavula navviṁpiṁchi seri yāsabuṭṭiṁchave
alugarānisuṭṭariga manniḍām̐ dĕlubave

(||||)
gakkanam̐ dĕraveyave karuṇado nunnavām̐ḍu
akkaḍikkaḍivā remī nanaganave
yikkuva śhrī veṁkaḍeśhum̐ ḍīḍa niṭṭĕ nannum̐ gūḍĕ
dakkinām̐ḍu tā nāgu tā nĕṟum̐gunanave