Ela talavamche vamdugemaayanu

ఏల తలవంచే వందుకేమాయను
Language

(॥పల్లవి॥)
ఏల తలవంచే వందుకేమాయను
కీలు నాకుఁ దెలుసు మిక్కిలిఁ దగవాయను

(॥ఏల॥)
చిప్పిలఁగఁ బొడమిన చెక్కుల నీచెమటలు
తప్పక చూచితే నాపెఁదలఁపాయను
వుప్పతిల్లునీసుద్దులు వూడిగపుసతులెల్లా
చెప్పఁగానే వినివిని సిగ్గులాయను

(॥ఏల॥)
వేడుక నీ చిటికన వేలనున్న వుంగరము
కూడినమీరతులకు గుఱుతాయను
యేడనుఁడో విచ్చేసితి విన్నిటా దొరవు నీవు
వీడె నిదె నీకొప్పు వెరగాయను

(॥ఏల॥)
కమ్ముకొన్న నీమోముకళలు దైవారఁగాను
నెమ్మది నిద్దరిపొందు నిజమాయను
యిమ్ముల శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి
నమ్మికతో నాకు నేఁడు నవ్వులాయను

(||pallavi||)
ela talavaṁche vaṁdugemāyanu
kīlu nāgum̐ dĕlusu mikkilim̐ dagavāyanu

(||ela||)
sippilam̐gam̐ bŏḍamina sĕkkula nīsĕmaḍalu
tappaga sūside nābĕm̐dalam̐pāyanu
vuppadillunīsuddulu vūḍigabusadulĕllā
sĕppam̐gāne vinivini siggulāyanu

(||ela||)
veḍuga nī siḍigana velanunna vuṁgaramu
kūḍinamīradulagu guṟudāyanu
yeḍanum̐ḍo vichchesidi vinniḍā dŏravu nīvu
vīḍĕ nidĕ nīgŏppu vĕragāyanu

(||ela||)
kammugŏnna nīmomugaḽalu daivāram̐gānu
nĕmmadi niddaribŏṁdu nijamāyanu
yimmula śhrīveṁkaḍeśha yiḍu nannu nelidivi
nammigado nāgu nem̐ḍu navvulāyanu