ఏల చిన్నఁ బోయినాఁడ విందుకుఁ గాను
(॥పల్లవి॥)
ఏల చిన్నఁ బోయినాఁడ విందుకుఁ గాను
ఆలరి వినోద మింతే ఆపె నీపైఁ గోపమా
(॥ఏల చిన్న॥)
కలికికన్నుఁ గొనల కాంత నిన్ను నవ్వఁగాను
తల వంచే వేమయ్య తక్కక నీవు
అలిగినవిధమో నీ వవ్వల యే మైనఁ జేసి
చెలరేఁగి యిందు వచ్చి సిగ్గు వడ్డ విధమో
(॥ఏల చిన్న॥)
సోవలు గా నూరివారి సుద్దు లాపె చెప్పితేను
యీవలఁ బైకిఁ దీసుకో నే లయ్య నీకు
తావుల నీ కందే మైనా తగులు గలదో కాక
కావిరి నెం దైన మరి కలఁగి వచ్చితివో
(॥ఏల చిన్న॥)
గక్కన నాపె నిన్నుఁ గాఁగిటఁ గూడఁగాను
వొక్కటై శ్రీవెంకటేశ వుస్సు రనేవు
అక్కడ నెవ్వతె కైన ఆస యిచ్చి వచ్చితివో
లక్కవలెఁ గరఁగినలాగు రతిఁ జూపేవో
(||pallavi||)
ela sinnam̐ boyinām̐ḍa viṁdugum̐ gānu
ālari vinoda miṁte ābĕ nībaim̐ gobamā
(||ela sinna||)
kaligigannum̐ gŏnala kāṁta ninnu navvam̐gānu
tala vaṁche vemayya takkaga nīvu
aliginavidhamo nī vavvala ye mainam̐ jesi
sĕlarem̐gi yiṁdu vachchi siggu vaḍḍa vidhamo
(||ela sinna||)
sovalu gā nūrivāri suddu lābĕ sĕppidenu
yīvalam̐ baigim̐ dīsugo ne layya nīgu
tāvula nī kaṁde mainā tagulu galado kāga
kāviri nĕṁ daina mari kalam̐gi vachchidivo
(||ela sinna||)
gakkana nābĕ ninnum̐ gām̐giḍam̐ gūḍam̐gānu
vŏkkaḍai śhrīvĕṁkaḍeśha vussu ranevu
akkaḍa nĕvvadĕ kaina āsa yichchi vachchidivo
lakkavalĕm̐ garam̐ginalāgu radim̐ jūbevo