Ela sigguvadevu nee vimdarum jooseramtaa

ఏల సిగ్గువడేవు నీ విందరుఁ జూచేరంటా
Language

(॥పల్లవి॥)
ఏల సిగ్గువడేవు నీ విందరుఁ జూచేరంటా
మేలు నీకు గలిగితే మేకొనఁగ రాదా

(॥ఏల॥)
సొలసి సొలసి యాకె చుట్టిరికేలు చెప్పఁగ
చెలరేఁగి విని నీవు చెమరించేవు
కలయ వేడుక నీకుఁ గలిగితేఁ గన కిట్టే
బులియక లోనికేఁగి భోగించరాదా

(॥ఏల॥)
వద్దనుండి యప్పటి నీవావులెల్లఁ దెలుపఁగ
కద్దనుచు సమ్మతించి కళ రేఁగేవు
పొద్దున నీకింతేసి పొందు సేయ వలసితే
పెద్దరికాలెందాఁకాను బెరయఁగ రాదా

(॥ఏల॥)
కూడినట్టి పొంతనాలు కొంకక తాఁ జెప్పఁగాను
యీడనే కాఁగిట నించి యిటు మెచ్చేవు
వోడక శ్రీవేంకటేశ వొనగూడితివి నన్ను
వీడరాదాపెను యిట్టే వెలయించ రాదా

(||pallavi||)
ela sigguvaḍevu nī viṁdarum̐ jūseraṁṭā
melu nīgu galigide megŏnam̐ga rādā

(||ela||)
sŏlasi sŏlasi yāgĕ suṭṭirigelu sĕppam̐ga
sĕlarem̐gi vini nīvu sĕmariṁchevu
kalaya veḍuga nīgum̐ galigidem̐ gana kiṭṭe
buliyaga lonigem̐gi bhogiṁcharādā

(||ela||)
vaddanuṁḍi yappaḍi nīvāvulĕllam̐ dĕlubam̐ga
kaddanusu sammadiṁchi kaḽa rem̐gevu
pŏdduna nīgiṁtesi pŏṁdu seya valaside
pĕddarigālĕṁdām̐kānu bĕrayam̐ga rādā

(||ela||)
kūḍinaṭṭi pŏṁtanālu kŏṁkaga tām̐ jĕppam̐gānu
yīḍane kām̐giḍa niṁchi yiḍu mĕchchevu
voḍaga śhrīveṁkaḍeśha vŏnagūḍidivi nannu
vīḍarādābĕnu yiṭṭe vĕlayiṁcha rādā