ఏల సిగ్గువడేవు నే నెఱిఁగితే నేమాయ
(॥పల్లవి॥)
ఏల సిగ్గువడేవు నే నెఱిఁగితే నేమాయ
తాలిమితో నాలోనే దాఁచుకొనే నిఁకను
(॥ఏల॥)
పతులు మన్నించినవి పరకాంతలతోడ
అతివలయినవారు ఆడుకొందురు
ఇతవుగాని వప్పుడు యేకతానఁ జేసినట్టి-
రతులరహస్యాలు రవ్వకెక్క నిపుడు
(॥ఏల॥)
వొంటిఁజేసినట్టి తమవుపచారాలు చెలితో
నంటుననుఁ జెప్పి చెప్పి నవ్వుకొందురు
జంటల నప్పటివేళ చవులైనకతలెల్లా
పెంటలఇంతులనోళ్ల పిరివీకు లౌను
(॥ఏల॥)
వలచినవలపులు వడిం దమచుట్టాలతో
అలరుచు ముచ్చటగా ననుకొందురు
యెలమి శ్రీవేంకటేశ ఇట్టె నన్నుఁ గూడితివి
తలఁచి అందరికిని తారుకాణలాయను
(||pallavi||)
ela sigguvaḍevu ne nĕṟim̐gide nemāya
tālimido nālone dām̐sugŏne nim̐kanu
(||ela||)
padulu manniṁchinavi paragāṁtaladoḍa
adivalayinavāru āḍugŏṁduru
idavugāni vappuḍu yegadānam̐ jesinaṭṭi-
radularahasyālu ravvagĕkka nibuḍu
(||ela||)
vŏṁṭim̐jesinaṭṭi tamavubasārālu sĕlido
naṁṭunanum̐ jĕppi sĕppi navvugŏṁduru
jaṁṭala nappaḍiveḽa savulainagadalĕllā
pĕṁṭala̮iṁtulanoḽla pirivīgu launu
(||ela||)
valasinavalabulu vaḍiṁ damasuṭṭālado
alarusu muchchaḍagā nanugŏṁduru
yĕlami śhrīveṁkaḍeśha iṭṭĕ nannum̐ gūḍidivi
talam̐si aṁdarigini tārugāṇalāyanu