ఏల సిగ్గువడేవు ఇందరముఁ జూచేమని
(॥పల్లవి॥)
ఏల సిగ్గువడేవు ఇందరముఁ జూచేమని
చాల వలచే వలపు చల్లించుకోవయ్యా
(॥॥)
చేకొని విడెము చేతికిచ్చి జవరాలు
ఆకుమడిచియ్యఁజూచీ నందుకోవయ్యా
మేకొని గందము నీమేనఁ బూసేనంటా వచ్చె
యీకడ నాట్టె పూయించుకొనవయ్యా
(॥॥)
చేరి పువ్వులసరులు చేతఁబట్టుక వున్నుది
కోరా యట్టె ముడుపించుకొనవయ్యా
గారవానఁ బాదాలొత్తఁగడువేడుకపడీని
పూరాడించి పాదాలు నీ వొత్తించుకొనవయ్యా
(॥॥)
పలిచి నీగరిడీలోఁబెనఁగేనఁటా నున్నది
చెలఁగి యాపెతో సాము నేయవయ్యా
యెలమి శ్రీ వేంకటేశ యిట్టె నన్నుఁగూడితివి
సొలసీ నాపె నిన్ను సొలయించుకోవయ్యా
(||pallavi||)
ela sigguvaḍevu iṁdaramum̐ jūsemani
sāla valase valabu salliṁchugovayyā
(||||)
segŏni viḍĕmu sedigichchi javarālu
āgumaḍisiyyam̐jūsī naṁdugovayyā
megŏni gaṁdamu nīmenam̐ būsenaṁṭā vachchĕ
yīgaḍa nāṭṭĕ pūyiṁchugŏnavayyā
(||||)
seri puvvulasarulu sedam̐baṭṭuga vunnudi
korā yaṭṭĕ muḍubiṁchugŏnavayyā
gāravānam̐ bādālŏttam̐gaḍuveḍugabaḍīni
pūrāḍiṁchi pādālu nī vŏttiṁchugŏnavayyā
(||||)
palisi nīgariḍīlom̐bĕnam̐genam̐ṭā nunnadi
sĕlam̐gi yābĕdo sāmu neyavayyā
yĕlami śhrī veṁkaḍeśha yiṭṭĕ nannum̐gūḍidivi
sŏlasī nābĕ ninnu sŏlayiṁchugovayyā