Ela sigguvade needam dide

ఏల సిగ్గువడె నీతఁ డిదె
Language

(॥పల్లవి॥)
ఏల సిగ్గువడె నీతఁ డిదె
కూళతనంబునఁ గొసరితినా

(॥ఏల॥)
మొక్కితి నూరకే మోనాన నుంటిని
తక్కినసుద్దులు దడవితినా
నిక్కి చూచితిని నేఁదల వంచితి
పక్కనఁ దనతోఁ బదరితినా

(॥ఏల॥)
కొలువు సేసితిని గుట్టున నుంటిని
పెలుచుఁదనంబులఁ బెనఁగితినా
మెలఁకువ వింటిని మిక్కిలి నవ్వితి
బలిమి సేసి మరి పదరితినా

(॥ఏల॥)
కందువ నిలిచితిఁ గాఁగిటఁ గూడితి
నిందలు దనపై నిలిపితినా
యిందునే శ్రీవేంకటేశుఁడు తాఁగూడె
ముందు వెనకలకు మొరఁగితినా

(||pallavi||)
ela sigguvaḍĕ nīdam̐ ḍidĕ
kūḽadanaṁbunam̐ gŏsaridinā

(||ela||)
mŏkkidi nūrage monāna nuṁṭini
takkinasuddulu daḍavidinā
nikki sūsidini nem̐dala vaṁchidi
pakkanam̐ danadom̐ badaridinā

(||ela||)
kŏluvu sesidini guṭṭuna nuṁṭini
pĕlusum̐danaṁbulam̐ bĕnam̐gidinā
mĕlam̐kuva viṁṭini mikkili navvidi
balimi sesi mari padaridinā

(||ela||)
kaṁduva nilisidim̐ gām̐giḍam̐ gūḍidi
niṁdalu danabai nilibidinā
yiṁdune śhrīveṁkaḍeśhum̐ḍu tām̐gūḍĕ
muṁdu vĕnagalagu mŏram̐gidinā