ఏల సిగ్గులువడేవు యేమిటికి లోఁగేవు
(॥పల్లవి॥)
ఏల సిగ్గులువడేవు యేమిటికి లోఁగేవు
కాలు దొక్కఁగా నిన్నుఁ గాదుకూడదనేమా
(॥ఏల॥)
ననుపుసేసుక నాతో నవ్వులు నవ్వేవాఁడవు
వొనరఁ బొందుసేయఁగా వొద్దనేమా
తనివోక దిష్టించి తగులఁ జూచేవాఁడవు
పెనఁగులాడఁగాను తప్పించుకొనేమా
(॥ఏల॥)
మక్కువలు చూపి మోపి మాటలాడేటి వాఁడవు
పక్కకు రాఁగాను చేపట్టకుండేమా
అక్కరతో నాకు నింత ఆసపడేటివాఁడవు
ఇక్కువ లంటఁగా నీకు నెదురాడేమా
(॥ఏల॥)
చలపట్టి నామోని చవులడగేవాఁడవు
మలసి పెండాడఁగాను మారుకొనేమా
యెలమి శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నేఁడు
వెలయ మన్నించఁగాను వింతగాఁ జూచేమా
(||pallavi||)
ela sigguluvaḍevu yemiḍigi lom̐gevu
kālu dŏkkam̐gā ninnum̐ gādugūḍadanemā
(||ela||)
nanubusesuga nādo navvulu navvevām̐ḍavu
vŏnaram̐ bŏṁduseyam̐gā vŏddanemā
tanivoga diṣhṭiṁchi tagulam̐ jūsevām̐ḍavu
pĕnam̐gulāḍam̐gānu tappiṁchugŏnemā
(||ela||)
makkuvalu sūbi mobi māḍalāḍeḍi vām̐ḍavu
pakkagu rām̐gānu sebaṭṭaguṁḍemā
akkarado nāgu niṁta āsabaḍeḍivām̐ḍavu
ikkuva laṁṭam̐gā nīgu nĕdurāḍemā
(||ela||)
salabaṭṭi nāmoni savulaḍagevām̐ḍavu
malasi pĕṁḍāḍam̐gānu mārugŏnemā
yĕlami śhrīveṁkaḍeśha yelidivi mammu nem̐ḍu
vĕlaya manniṁcham̐gānu viṁtagām̐ jūsemā