Ela sigguluvadevu yedudigi raamgadave

ఏల సిగ్గులువడేవు యెదుటికి రాఁగదవే
Language

(॥పల్లవి॥)
ఏల సిగ్గులువడేవు యెదుటికి రాఁగదవే
సోలిగా నీ సింగారాలు చూచుఁగాని యీతఁడు

(॥॥)
కొప్పువెట్టుకొంటివిగా కుప్పెసవరముతోడ
కప్పితివిగా పయ్యద కడుఁ బోలుగా
చిప్పిలఁ బూసితీవిగా చెంపలునిండా జవ్వాది
యిప్పుడె గక్కనఁ బతి నిఁక వలపించవే

(॥॥)
కట్టుకొంటివిగా చీర కళ బెళమనఁ గాను
వొట్టుకొంటివిగా సొమ్ము లొళ్లునిండాను
గట్టిగా నిడుకొంటిగా కన్నులనుఁ గాటుక
దట్టముగా నీతనికి తమిరేఁచఁ గదవే

(॥॥)
సేసితిగా విడేలు చెంగావిమోవెల్లాఁ గప్ప
వేసితివిగా మెడను విరిదండలు
వేసర కలమేల్మంగవిభుఁడు శ్రీ వేంకటేశుఁ
డాసతో నన్నేలె నీవూ నంటవే యీతనిని

(||pallavi||)
ela sigguluvaḍevu yĕduḍigi rām̐gadave
soligā nī siṁgārālu sūsum̐gāni yīdam̐ḍu

(||||)
kŏppuvĕṭṭugŏṁṭivigā kuppĕsavaramudoḍa
kappidivigā payyada kaḍum̐ bolugā
sippilam̐ būsidīvigā sĕṁpaluniṁḍā javvādi
yippuḍĕ gakkanam̐ badi nim̐ka valabiṁchave

(||||)
kaṭṭugŏṁṭivigā sīra kaḽa bĕḽamanam̐ gānu
vŏṭṭugŏṁṭivigā sŏmmu lŏḽluniṁḍānu
gaṭṭigā niḍugŏṁṭigā kannulanum̐ gāḍuga
daṭṭamugā nīdanigi tamirem̐sam̐ gadave

(||||)
sesidigā viḍelu sĕṁgāvimovĕllām̐ gappa
vesidivigā mĕḍanu viridaṁḍalu
vesara kalamelmaṁgavibhum̐ḍu śhrī veṁkaḍeśhum̐
ḍāsado nannelĕ nīvū naṁṭave yīdanini