ఏల సిగ్గులువడేవే యింతిరో నీవు
(॥పల్లవి॥)
ఏల సిగ్గులువడేవే యింతిరో నీవు
వేళవేళ నూడిగాలు వెలయఁగఁ జేయవే
(॥ఏల॥)
చూడఁజూడఁ దగులును చుట్టరికము
వాడికలనే పెరుగు వలపులును
తోడనే గుట్టైతే నిక్కు దొరతనము
వీడెమిచ్చి పతితోను వేడుక నెరపవే
(॥ఏల॥)
సేయఁగఁజేయఁగ మించు చెలుములెల్లా
కాయముఁగాయ మంటితేఁ గరఁగు మతి
పాయక కాచుకుండితేఁ బంత మీడేరు
ఆయములంటి మగని నాసలురేఁచవే
(॥ఏల॥)
నవ్వనవ్వమీఁద మీఁద నాఁటుఁ బ్రియము
వువ్విళ్లూరితేఁ గోరిక లుప్పతిలును
యివ్వల శ్రీవేంకటేశుఁ డేలె నిన్నును
చివ్వన నితనిఁ జెంది సేవలు సేయవే
(||pallavi||)
ela sigguluvaḍeve yiṁtiro nīvu
veḽaveḽa nūḍigālu vĕlayam̐gam̐ jeyave
(||ela||)
sūḍam̐jūḍam̐ dagulunu suṭṭarigamu
vāḍigalane pĕrugu valabulunu
toḍane guṭṭaide nikku dŏradanamu
vīḍĕmichchi padidonu veḍuga nĕrabave
(||ela||)
seyam̐gam̐jeyam̐ga miṁchu sĕlumulĕllā
kāyamum̐gāya maṁṭidem̐ garam̐gu madi
pāyaga kāsuguṁḍidem̐ baṁta mīḍeru
āyamulaṁṭi magani nāsalurem̐save
(||ela||)
navvanavvamīm̐da mīm̐da nām̐ṭum̐ briyamu
vuvviḽlūridem̐ goriga luppadilunu
yivvala śhrīveṁkaḍeśhum̐ ḍelĕ ninnunu
sivvana nidanim̐ jĕṁdi sevalu seyave