Ela sigguluvadeve yelayimchinattayyeeni

ఏల సిగ్గులువడేవే యెలయించినట్టయ్యీని
Language

(॥పల్లవి॥)
ఏల సిగ్గులువడేవే యెలయించినట్టయ్యీని
వాలాయించి నీకుఁ గానే వలచినాఁ డతఁడు

(॥॥)
పాడి చూపఁగదవే నీపతి వేడుకపడీని
వీడఁ మందుకొనవే వేవేగమే
చూడవే యాతనిదిక్కు సుద్దు లడుగఁ బూఁచీని
కూడేటికూటములకు గుబ్బతిల్లీ నతఁడు

(॥॥)
అట్టె పాదాలొత్తవే అందుకే తమకించీ
పెట్టుకోవే తానిచ్చిన పెనుసొమ్ములు
గుట్టుతోడఁ గూచుండవే కొంగువట్టి వేఁడుకొనీ
గట్టిగా నీ పొందులే కడుఁగోరీ నతఁడు

(॥॥)
నెలవుల నవ్వవే శ్రీ వేంకటేశుఁడు నవ్వి
పిలిచి నూఁకొనవే ప్రియముతోడ
లలి గుబ్బలనొత్తవే లాలననేసీ నిన్ను
తలఁపించి నీరతికే తమకించీ నతఁడు

(||pallavi||)
ela sigguluvaḍeve yĕlayiṁchinaṭṭayyīni
vālāyiṁchi nīgum̐ gāne valasinām̐ ḍadam̐ḍu

(||||)
pāḍi sūbam̐gadave nībadi veḍugabaḍīni
vīḍam̐ maṁdugŏnave vevegame
sūḍave yādanidikku suddu laḍugam̐ būm̐sīni
kūḍeḍigūḍamulagu gubbadillī nadam̐ḍu

(||||)
aṭṭĕ pādālŏttave aṁduge tamagiṁchī
pĕṭṭugove tānichchina pĕnusŏmmulu
guṭṭudoḍam̐ gūsuṁḍave kŏṁguvaṭṭi vem̐ḍugŏnī
gaṭṭigā nī pŏṁdule kaḍum̐gorī nadam̐ḍu

(||||)
nĕlavula navvave śhrī veṁkaḍeśhum̐ḍu navvi
pilisi nūm̐kŏnave priyamudoḍa
lali gubbalanŏttave lālananesī ninnu
talam̐piṁchi nīradige tamagiṁchī nadam̐ḍu