ఏల సిగ్గులువడేరు యిందరుఁ జూచేరంటా
(॥పల్లవి॥)
ఏల సిగ్గులువడేరు యిందరుఁ జూచేరంటా
వోలిఁ దెర వేతునా మీకొనగూడె వలపు
(॥ఏల॥)
శిరసుపై తలఁబాలు చెంపలవెంట జారఁగ
వొరసీఁ జన్నుల నిన్నొద్దికై చెలి
అరమోడ్పుఁగన్నులతో నాకెమీఁద నొరగేవు
తెరవేతునా మీకు తేటపడె వలపు
(॥ఏల॥)
కట్టినట్టి ముంజేతికంకణము బిగియఁగ
ముట్టి నీతొడఁ బిరుదు మోపీఁ జెలి
అట్టెమతిఁ గరఁగుతా నాకెచెక్కు నొక్కేవు
గుట్టుతో తెరవేతునా గురుతాయ వలపు
(॥ఏల॥)
తొక్కినట్టి నీపాదము తొడఁదొడఁ బెనఁగఁగ
గక్కన నిన్నుఁ గాఁగిట గదిమీఁజెలి
అక్కున శ్రీవేంకటేశ అదిమేవాకెను నీవు
చక్కఁగాఁ దెరవేతునా సతమాయ వలపు
(||pallavi||)
ela sigguluvaḍeru yiṁdarum̐ jūseraṁṭā
volim̐ dĕra vedunā mīgŏnagūḍĕ valabu
(||ela||)
śhirasubai talam̐bālu sĕṁpalavĕṁṭa jāram̐ga
vŏrasīm̐ jannula ninnŏddigai sĕli
aramoḍpum̐gannulado nāgĕmīm̐da nŏragevu
tĕravedunā mīgu teḍabaḍĕ valabu
(||ela||)
kaṭṭinaṭṭi muṁjedigaṁkaṇamu bigiyam̐ga
muṭṭi nīdŏḍam̐ birudu mobīm̐ jĕli
aṭṭĕmadim̐ garam̐gudā nāgĕsĕkku nŏkkevu
guṭṭudo tĕravedunā gurudāya valabu
(||ela||)
tŏkkinaṭṭi nībādamu tŏḍam̐dŏḍam̐ bĕnam̐gam̐ga
gakkana ninnum̐ gām̐giḍa gadimīm̐jĕli
akkuna śhrīveṁkaḍeśha adimevāgĕnu nīvu
sakkam̐gām̐ dĕravedunā sadamāya valabu