Ela siggulubadeve yemdaamkaanu

ఏల సిగ్గులుపడేవే యెందాఁకాను
Language

(॥పల్లవి॥)
ఏల సిగ్గులుపడేవే యెందాఁకాను
వేళవేళతోఁ బతికి విడెమియ్యవే

(॥ఏల॥)
పండినపంటవంటిది పాయపునాఁటిమదము
నిండుఁజెరువువంటిది నెయ్యపుటాన
వుండనుండ నని లోలో నుడివోవకుండును
అండనుండినపతికి నప్పగించవే

(॥ఏల॥)
పెరతేనియవంటిది ప్రియములతమకము
విరివాసనవంటిది వేడుకనవ్వు
సరికిబేసికి నవి చవిదప్పకుండాను
దొరకె నాతనికే విందులు సేయవే

(॥ఏల॥)
చేవ చిగురువంటిది చెందినకాఁగిటిరతి
భావము సొంపువంటిది పైకొన్నమేలు
వానితోఁ గూడితి విఁక వరుసదప్పకుండాను
శ్రీవేంకటేశ్వరుని సేవ సేయవే

(||pallavi||)
ela siggulubaḍeve yĕṁdām̐kānu
veḽaveḽadom̐ badigi viḍĕmiyyave

(||ela||)
paṁḍinabaṁṭavaṁṭidi pāyabunām̐ṭimadamu
niṁḍum̐jĕruvuvaṁṭidi nĕyyabuḍāna
vuṁḍanuṁḍa nani lolo nuḍivovaguṁḍunu
aṁḍanuṁḍinabadigi nappagiṁchave

(||ela||)
pĕradeniyavaṁṭidi priyamuladamagamu
virivāsanavaṁṭidi veḍuganavvu
sarigibesigi navi savidappaguṁḍānu
dŏragĕ nādanige viṁdulu seyave

(||ela||)
seva siguruvaṁṭidi sĕṁdinagām̐giḍiradi
bhāvamu sŏṁpuvaṁṭidi paigŏnnamelu
vānidom̐ gūḍidi vim̐ka varusadappaguṁḍānu
śhrīveṁkaḍeśhvaruni seva seyave