Ela siggulu vadevu yevvaru ninnu navveru

ఏల సిగ్గులు వడేవు యెవ్వరు నిన్ను నవ్వేరు
Language

(॥పల్లవి॥)
ఏల సిగ్గులు వడేవు యెవ్వరు నిన్ను నవ్వేరు
యీలీల నేఁ జెలికత్తె నెవ్వరితోఁ జెప్పీనే

(॥ఏల॥)
పొంతనె యప్పటినుండి పొత్తునఁ గూచుండుమనీ
ఇంతిరో విభునిమాట యియ్యకొనవే
యెంత వేడుకో కాని యిట్టె కూడి చేతికిచ్చీ
సంతోసానఁ గైకొని చవిగొనవే

(॥ఏల॥)
మించి తననోరిపాలమీఁగడ నీకొసగీని
అంచెల నీ మోవితేనె అందుకొనవే
నించిన రసాయనము నీకు పుక్కిటినె చూపీ
పొంచి పావురమువలెఁ బూని యారగించవే

(॥ఏల॥)
వేడుక బువ్వాలలోనె వేవేలు రతులు సేసీ
వీడక నీవూ నెదురు విందు వెట్టవే
యీడనె శ్రీవెంకటేశుఁ డీతఁ డలమేల్‌మంగవు
కూడితివి తనిసి యిక్కువ నుండఁగదవే

(||pallavi||)
ela siggulu vaḍevu yĕvvaru ninnu navveru
yīlīla nem̐ jĕligattĕ nĕvvaridom̐ jĕppīne

(||ela||)
pŏṁtanĕ yappaḍinuṁḍi pŏttunam̐ gūsuṁḍumanī
iṁtiro vibhunimāḍa yiyyagŏnave
yĕṁta veḍugo kāni yiṭṭĕ kūḍi sedigichchī
saṁtosānam̐ gaigŏni savigŏnave

(||ela||)
miṁchi tananoribālamīm̐gaḍa nīgŏsagīni
aṁchĕla nī movidenĕ aṁdugŏnave
niṁchina rasāyanamu nīgu pukkiḍinĕ sūbī
pŏṁchi pāvuramuvalĕm̐ būni yāragiṁchave

(||ela||)
veḍuga buvvālalonĕ vevelu radulu sesī
vīḍaga nīvū nĕduru viṁdu vĕṭṭave
yīḍanĕ śhrīvĕṁkaḍeśhum̐ ḍīdam̐ ḍalamel‌maṁgavu
kūḍidivi tanisi yikkuva nuṁḍam̐gadave