ఏల సిగ్గులు వడేవు యెన్నటికి నీ పొందులు
(॥పల్లవి॥)
ఏల సిగ్గులు వడేవు యెన్నటికి నీ పొందులు
ఆలనయ్యేనంటా నున్న దాదరించ రాదా
(॥ఏల॥)
కొనచూపులనుఁ జూచి కొలువు చేసీ నీకు
పనులు చెప్పఁగరాదా పడఁతికిని
చొనిపి మాటలాడి చుట్టిరికాలు చూపీని
వెనుకొని నీవు నట్టే వియ్యమందరాదా
(॥ఏల॥)
వూడిగాలు చేసేనంటా నొద్దఁ గాచుకున్నది
వీడె మందుకొనరాదా వెలఁదిచేత
వాడిక నవ్వులునవ్వి వలపులు చల్లీని
కూడేనని బాసయిచ్చి కొప్పు దువ్వరాదా
(॥ఏల॥)
పచ్చిమోవి విందువెట్టి బదికే నంటానున్నది
మెచ్చి కాఁగిలించరాదా మెలుఁత నిఁక
యిచ్చట శ్రీవేంకటేశ యేలితివి నన్నునిట్టే
తచ్చి యాపెతో నేకాంతము చెప్పరాదా
(||pallavi||)
ela siggulu vaḍevu yĕnnaḍigi nī pŏṁdulu
ālanayyenaṁṭā nunna dādariṁcha rādā
(||ela||)
kŏnasūbulanum̐ jūsi kŏluvu sesī nīgu
panulu sĕppam̐garādā paḍam̐tigini
sŏnibi māḍalāḍi suṭṭirigālu sūbīni
vĕnugŏni nīvu naṭṭe viyyamaṁdarādā
(||ela||)
vūḍigālu sesenaṁṭā nŏddam̐ gāsugunnadi
vīḍĕ maṁdugŏnarādā vĕlam̐diseda
vāḍiga navvulunavvi valabulu sallīni
kūḍenani bāsayichchi kŏppu duvvarādā
(||ela||)
pachchimovi viṁduvĕṭṭi badige naṁṭānunnadi
mĕchchi kām̐giliṁcharādā mĕlum̐ta nim̐ka
yichchaḍa śhrīveṁkaḍeśha yelidivi nannuniṭṭe
tachchi yābĕdo negāṁtamu sĕpparādā