Ela siggulu vadevu imdari mumdaraa neevu

ఏల సిగ్గులు వడేవు ఇందరి ముందరా నీవు
Language

(॥పల్లవి॥)
ఏల సిగ్గులు వడేవు ఇందరి ముందరా నీవు
తాలిమితో నీ వలపు తవ్వుకొనఁ గదవే

(॥ఏల॥)
విచ్చన విడాయ నీకు విభుఁ డింటికి రాఁగాను
నచ్చుకొట్టనేల యిఁక నవ్వఁగదవే
యిచ్చె నీకుఁ జన వాతఁ డిఁకనేల కొంకేవు
పచ్చిదేర నీ యెమ్మెలు పచారించఁగదవే

(॥ఏల॥)
పంతమెల్లాఁ జెల్లె పతి పక్కఁ బెట్టుకొనఁగాను
చెంతనున్న చెలులతోఁ జెప్పఁగదవే
మంతనమాడీ నతడు మరి నీవాడినట్టౌను
చింతదీరఁ గాఁపురాలు సేయఁగదవే

(॥ఏల॥)
యీడేరితివి శ్రీవేంకటేశుఁడు ని న్నేలఁగాను
వేడుకతో వరములు వేఁడఁగదవే
వాడిక నితఁడు నావద్దికి వచ్చి మన్నించె
జోడయి నీ వొక్కమనసున నుండఁగదవే

(||pallavi||)
ela siggulu vaḍevu iṁdari muṁdarā nīvu
tālimido nī valabu tavvugŏnam̐ gadave

(||ela||)
vichchana viḍāya nīgu vibhum̐ ḍiṁṭigi rām̐gānu
nachchugŏṭṭanela yim̐ka navvam̐gadave
yichchĕ nīgum̐ jana vādam̐ ḍim̐kanela kŏṁkevu
pachchidera nī yĕmmĕlu pasāriṁcham̐gadave

(||ela||)
paṁtamĕllām̐ jĕllĕ padi pakkam̐ bĕṭṭugŏnam̐gānu
sĕṁtanunna sĕluladom̐ jĕppam̐gadave
maṁtanamāḍī nadaḍu mari nīvāḍinaṭṭaunu
siṁtadīram̐ gām̐purālu seyam̐gadave

(||ela||)
yīḍeridivi śhrīveṁkaḍeśhum̐ḍu ni nnelam̐gānu
veḍugado varamulu vem̐ḍam̐gadave
vāḍiga nidam̐ḍu nāvaddigi vachchi manniṁchĕ
joḍayi nī vŏkkamanasuna nuṁḍam̐gadave