Ela sesevu maayalu yemdaamkaanainaanu

ఏల సేసేవు మాయలు యెందాఁకానైనాను
Language

(॥పల్లవి॥)
ఏల సేసేవు మాయలు యెందాఁకానైనాను
చాలుఁ జాలు నాపె కిట్టె చనవియ్యరాదా

(॥ఏల॥)
చేరఁడేసి కన్నులాపె చేరి నిన్నుఁ జూడఁగాను
దారకపు నీచేఁతలు దాఁచఁగలవా
గోరగీరి వలపులయేరులు పైఁబరపఁగా
ఆరితేరే నీమనసు అడ్డ పెట్టఁగలవా

(॥ఏల॥)
తీవెలవంటి చేతులవెఱవ నిన్నంటఁగాను
ఆవలికి నీకోరికె లంపఁగలవా
మోవి తీపు నాములెల్లా ముంచి తలకెక్కఁగాను
కావరపు నీమరులు కడు దించఁగలవా

(॥ఏల॥)
కొండలంతలు చన్నులకొమ్మ నిన్నుఁ గూడఁగాను
అండ శ్రీ వేంకటేశ పాయఁగఁగలవా
దండి వేడుకల సంపదలు మీఁదఁ గప్పఁగాను
మెండైన పరవశాలు మీరఁగఁ గలవా

(||pallavi||)
ela sesevu māyalu yĕṁdām̐kānainānu
sālum̐ jālu nābĕ kiṭṭĕ sanaviyyarādā

(||ela||)
seram̐ḍesi kannulābĕ seri ninnum̐ jūḍam̐gānu
dāragabu nīsem̐talu dām̐sam̐galavā
goragīri valabulayerulu paim̐barabam̐gā
āridere nīmanasu aḍḍa pĕṭṭam̐galavā

(||ela||)
tīvĕlavaṁṭi sedulavĕṟava ninnaṁṭam̐gānu
āvaligi nīgorigĕ laṁpam̐galavā
movi tību nāmulĕllā muṁchi talagĕkkam̐gānu
kāvarabu nīmarulu kaḍu diṁcham̐galavā

(||ela||)
kŏṁḍalaṁtalu sannulagŏmma ninnum̐ gūḍam̐gānu
aṁḍa śhrī veṁkaḍeśha pāyam̐gam̐galavā
daṁḍi veḍugala saṁpadalu mīm̐dam̐ gappam̐gānu
mĕṁḍaina paravaśhālu mīram̐gam̐ galavā