ఏల సేసేవు మాతో నిన్నిమాయలు
(॥పల్లవి॥)
ఏల సేసేవు మాతో నిన్నిమాయలు
పోలించితే గురుతులు బూమెల్ల నిండవా
(॥॥)
మలసి నీవెంత నాతో మఱఁగులు వెట్టినాను
కలికి నీతో నవ్వఁగాఁ గానరాదా
పొలుపుగ మరీఁగొన్ని బొంకులు బొంకినాను
పలు నీచేఁతలు బట్టిబయటనే పడవా
(॥॥)
అందరిలో నీవు నాపై నానలెన్ని వెట్టినాను
యిందుముఖి మొక్కఁగాను యెఱఁగరాదా
గొందినెంత తలవంచుకొని నీవు వుండినాను
విందులాపె చెప్పరాఁగా వెల్లవిరి గాదా
(॥॥)
పెనఁగి నాకెంత నీవు ప్రియములు చెప్పినాను
పనులాపె సేయగాను పచ్చిగాదా
ఘనుఁడ శ్రీవేంకటేశ కలసితివిటు నన్ను
ననుపులాపె చూపఁగా పెనురట్టు గాదా
(||pallavi||)
ela sesevu mādo ninnimāyalu
poliṁchide gurudulu būmĕlla niṁḍavā
(||||)
malasi nīvĕṁta nādo maṟam̐gulu vĕṭṭinānu
kaligi nīdo navvam̐gām̐ gānarādā
pŏlubuga marīm̐gŏnni bŏṁkulu bŏṁkinānu
palu nīsem̐talu baṭṭibayaḍane paḍavā
(||||)
aṁdarilo nīvu nābai nānalĕnni vĕṭṭinānu
yiṁdumukhi mŏkkam̐gānu yĕṟam̐garādā
gŏṁdinĕṁta talavaṁchugŏni nīvu vuṁḍinānu
viṁdulābĕ sĕpparām̐gā vĕllaviri gādā
(||||)
pĕnam̐gi nāgĕṁta nīvu priyamulu sĕppinānu
panulābĕ seyagānu pachchigādā
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kalasidiviḍu nannu
nanubulābĕ sūbam̐gā pĕnuraṭṭu gādā