ఏల సేసే వడియాస లిందాఁకాను
(॥పల్లవి॥)
ఏల సేసే వడియాస లిందాఁకాను
ఆలకించి వున్నదాన నందాఁకాను
(॥॥)
వచ్చి వచ్చి వేగిరాలు వలవనిజాగరాలు
యిచ్చల నడపితిగా యిందాఁకాను
వెచ్చనివూరుపులును వీరిడినేరుపులును
అచ్చుపడె నాకైతే నందాఁకాను
(॥॥)
మాటలలో తీపులును మాయదారి చూపులను
యేఁటవెట్టి నడపితి విందాఁకాను
వాఁటమైన కాఁకలును వట్టికొమరాఁకలును
ఆఁటదాన నేఁ బడితి నందాఁకాను
(॥॥)
సెలవులనగవులు చే చాఁచి తగవులు
యెలమిఁ జేసితివిగా యిందాఁకాను
చెలఁగి శ్రీ వేంకటేశ చెక్కు నొక్కి కూడితి నే-
నలవోకతోడ నుంటి నందాఁకాను
(||pallavi||)
ela sese vaḍiyāsa liṁdām̐kānu
ālagiṁchi vunnadāna naṁdām̐kānu
(||||)
vachchi vachchi vegirālu valavanijāgarālu
yichchala naḍabidigā yiṁdām̐kānu
vĕchchanivūrubulunu vīriḍinerubulunu
achchubaḍĕ nāgaide naṁdām̐kānu
(||||)
māḍalalo tībulunu māyadāri sūbulanu
yem̐ṭavĕṭṭi naḍabidi viṁdām̐kānu
vām̐ṭamaina kām̐kalunu vaṭṭigŏmarām̐kalunu
ām̐ṭadāna nem̐ baḍidi naṁdām̐kānu
(||||)
sĕlavulanagavulu se sām̐si tagavulu
yĕlamim̐ jesidivigā yiṁdām̐kānu
sĕlam̐gi śhrī veṁkaḍeśha sĕkku nŏkki kūḍidi ne-
nalavogadoḍa nuṁṭi naṁdām̐kānu