Ela seppeeni suddu lemdaamkaa needonu

ఏల చెప్పీని సుద్దు లెందాఁకా నీతోను
Language

(॥పల్లవి॥)
ఏల చెప్పీని సుద్దు లెందాఁకా నీతోను
పాలుమాలక యింతలో బ్రహ్మచారివైతివి

(॥ఏల॥)
యెలమి గొల్లెతలను యిన్నాళ్లు పొంది పొంది
తొలఁగి మధురలోన దొర వైతివి
కొలఁది యావులఁ గాచి గొల్లవాఁడవై యుండి
వలవంత నేఁడు రాచవాఁడ వైతివి

(॥ఏల॥)
వేడుకలకు నింటింటి వెన్నలు దొంగిలి
ఆడ ద్వారకలో సోమయాజి వైతివి
పోడక రుక్కిణిదేవి నూరకే యెత్తుకవచ్చి
పాడితో నగ్రవూజకుఁ బాత్రుఁడ వైతివి

(॥ఏల॥)
రక్కసుల కాఁపురాలు రచ్చల కెక్కఁ జెఱిచి
పెక్కు ధర్మములు నిలిపి పెద్దవైతివి
చిక్కువాసి నన్నుఁ గూడి శ్రీ వేంకటాద్రిమీఁద
దిక్కులనిందరిపాలి దేవార వైతివి

(||pallavi||)
ela sĕppīni suddu lĕṁdām̐kā nīdonu
pālumālaga yiṁtalo brahmasārivaidivi

(||ela||)
yĕlami gŏllĕdalanu yinnāḽlu pŏṁdi pŏṁdi
tŏlam̐gi madhuralona dŏra vaidivi
kŏlam̐di yāvulam̐ gāsi gŏllavām̐ḍavai yuṁḍi
valavaṁta nem̐ḍu rāsavām̐ḍa vaidivi

(||ela||)
veḍugalagu niṁṭiṁṭi vĕnnalu dŏṁgili
āḍa dvāragalo somayāji vaidivi
poḍaga rukkiṇidevi nūrage yĕttugavachchi
pāḍido nagravūjagum̐ bātrum̐ḍa vaidivi

(||ela||)
rakkasula kām̐purālu rachchala kĕkkam̐ jĕṟisi
pĕkku dharmamulu nilibi pĕddavaidivi
sikkuvāsi nannum̐ gūḍi śhrī veṁkaḍādrimīm̐da
dikkulaniṁdaribāli devāra vaidivi