Ela senagevu nannu nippude neevu

ఏల చెనకేవు నన్ను నిప్పుడె నీవు
Language

(॥పల్లవి॥)
ఏల చెనకేవు నన్ను నిప్పుడె నీవు
తాలిమితోఁ బదరెటిదానఁ గాను నేనూ

(॥ఏల॥)
వూర కిట్టె నా మీఁద నొళ్లు వేసితివి నేఁడు
కారణ మేఁటిదో కాని కంద మిఁకను
సారెఁ జట్టి పట్టితివి జారనపయ్యదకొంగు
తేరకొన నిది యేమో తెలిసేరా నేను

(॥ఏల॥)
మన సిచ్చి నాతోడ మాఁటలాడే విదె నేఁడు
కొన మొద లేదో చూచుకొంద మిఁకను
చన విచ్చి మంచముపై సంగడిఁ గూచుంటి విదె
పని నిన్ను నడిగేరా పలుమారు నేను

(॥ఏల॥)
గక్కనఁ గాఁగిలిచుక కందువ లంటేవు నేఁడు
యెక్కువగా నవ్వేరా యిందుకే నేను
నిక్కము శ్రీవెంకటేశ నీవు నన్నుఁ గూడితివి
మిక్కిలి నీజాడలకు మెచ్చేరా నేను

(||pallavi||)
ela sĕnagevu nannu nippuḍĕ nīvu
tālimidom̐ badarĕḍidānam̐ gānu nenū

(||ela||)
vūra kiṭṭĕ nā mīm̐da nŏḽlu vesidivi nem̐ḍu
kāraṇa mem̐ṭido kāni kaṁda mim̐kanu
sārĕm̐ jaṭṭi paṭṭidivi jāranabayyadagŏṁgu
teragŏna nidi yemo tĕliserā nenu

(||ela||)
mana sichchi nādoḍa mām̐ṭalāḍe vidĕ nem̐ḍu
kŏna mŏda ledo sūsugŏṁda mim̐kanu
sana vichchi maṁchamubai saṁgaḍim̐ gūsuṁṭi vidĕ
pani ninnu naḍigerā palumāru nenu

(||ela||)
gakkanam̐ gām̐gilisuga kaṁduva laṁṭevu nem̐ḍu
yĕkkuvagā navverā yiṁduge nenu
nikkamu śhrīvĕṁkaḍeśha nīvu nannum̐ gūḍidivi
mikkili nījāḍalagu mĕchcherā nenu