ఏల సత్యములు సేసే వెట్టు నమ్మేది
(॥పల్లవి॥)
ఏల సత్యములు సేసే వెట్టు నమ్మేది
తాలిమి నీకుఁ గద్దా తరుణులయెడను
(॥ఏల॥)
సముకాననుండి యాపె సారె వలపించఁగాను
భ్రమయకుండుదువా పలుమారును
చెమటలు సోఁక నటు చే వట్టి పెనఁగఁగా
తమకించకుండుదువా తతిఁ గూడను
(॥ఏల॥)
రాతిరిఁ బగలు నీకు రమణి వీడె మియ్యఁగా
కాతరించకుండుదువా కందువలను
పోతరించి యప్పటి నీ పొందులమాట లాడఁగా
యేతులఁ గూడ కుండేవా యెంతైన
(॥ఏల॥)
పానుపువద్దనుండి పాదము లాపె వొత్తఁగ
కానిమ్మనకుండుదువా కౌఁగిటికి
పూని శ్రీవేంకటేశ్వర పొందితివి నన్ను నిట్టే
మానినితోఁ జెప్పక మానుదువా నీవు
(||pallavi||)
ela satyamulu sese vĕṭṭu nammedi
tālimi nīgum̐ gaddā taruṇulayĕḍanu
(||ela||)
samugānanuṁḍi yābĕ sārĕ valabiṁcham̐gānu
bhramayaguṁḍuduvā palumārunu
sĕmaḍalu som̐ka naḍu se vaṭṭi pĕnam̐gam̐gā
tamagiṁchaguṁḍuduvā tadim̐ gūḍanu
(||ela||)
rādirim̐ bagalu nīgu ramaṇi vīḍĕ miyyam̐gā
kādariṁchaguṁḍuduvā kaṁduvalanu
podariṁchi yappaḍi nī pŏṁdulamāḍa lāḍam̐gā
yedulam̐ gūḍa kuṁḍevā yĕṁtaina
(||ela||)
pānubuvaddanuṁḍi pādamu lābĕ vŏttam̐ga
kānimmanaguṁḍuduvā kaum̐giḍigi
pūni śhrīveṁkaḍeśhvara pŏṁdidivi nannu niṭṭe
māninidom̐ jĕppaga mānuduvā nīvu