ఏల సరసములాడే వెవ్వరితోనై నాను
(॥పల్లవి॥)
ఏల సరసములాడే వెవ్వరితోనై నాను
కాలుదాఁకి నాపెతోనే కావలెఁ గాక
(॥॥)
చెలిమికతైలకెల్లాఁ జెనకఁగవచ్చునా
వొలిసి నీపట్టపుదేవులకుఁగాక
పిలిచి పేరటాండ్లు పెండ్లిబండెక్కుదురా
అల సేసవెట్టినయాపె గాక
(॥॥)
వద్దన్నవారెల్లవలపులు చల్లుదురా
వద్దికై మేనమరఁదుఁ లొరయుఁ గాక
పొద్దువోనిచుట్టాలు బువ్వానకు వత్తురా
అద్ది కంకణముగట్టినాపె వచ్చుఁ గాక
(॥॥)
పొరుగు పోరచివారు భోగించవత్తురా
గరిమఁ గాఁగిటిలోని కాంత కౌఁగాక
యిరవై శ్రీవెంకటేశ యేలితి విందుకె నమ్న
అరసి నీవుమన్నించినాపె యాలౌఁ గాక
(||pallavi||)
ela sarasamulāḍe vĕvvaridonai nānu
kāludām̐ki nābĕdone kāvalĕm̐ gāga
(||||)
sĕlimigadailagĕllām̐ jĕnagam̐gavachchunā
vŏlisi nībaṭṭabudevulagum̐gāga
pilisi peraḍāṁḍlu pĕṁḍlibaṁḍĕkkudurā
ala sesavĕṭṭinayābĕ gāga
(||||)
vaddannavārĕllavalabulu salludurā
vaddigai menamaram̐dum̐ lŏrayum̐ gāga
pŏdduvonisuṭṭālu buvvānagu vatturā
addi kaṁkaṇamugaṭṭinābĕ vachchum̐ gāga
(||||)
pŏrugu porasivāru bhogiṁchavatturā
garimam̐ gām̐giḍiloni kāṁta kaum̐gāga
yiravai śhrīvĕṁkaḍeśha yelidi viṁdugĕ namna
arasi nīvumanniṁchinābĕ yālaum̐ gāga