ఏల సారెకుఁ జెప్పేవు యెడమాటలు
(॥పల్లవి॥)
ఏల సారెకుఁ జెప్పేవు యెడమాటలు
తాలిమి సేసుకొంటిఁ దనిసితివే
(॥ఏల॥)
రానీవే ఆతఁడు మేరలు దప్పఁడనేవు
కానీవే నీవేమి కల్లలాడేవా
పోనీవు యెంతైనఁ బోయిన సుద్దులు నీవు
యీనిజమే కలితే నిన్నియు మెచ్చేనే
(॥ఏల॥)
పట్టినీవే నాచెరఁగు బత్తిగలఁ డనేవు
అట్టె యవునే నీ వంతదానవు
గట్టిసేసే వప్పటిని కప్పి తొల్లిటిబాసలు
చుట్టుకొంటే వలపులు సులభ మయ్యీనే
(॥ఏల॥)
చెప్పనీవే ప్రియములు సేవకు మెచ్చెననేవు
చిప్పిల నీవే మాకుఁ జెలికత్తెవు
యిప్పుడె శ్రీవేంకటేశుఁ డేలె నన్నుఁ గరుణించి
వొప్పుకొంటే మనసులు వొక్కటే యయ్యీనే
(||pallavi||)
ela sārĕgum̐ jĕppevu yĕḍamāḍalu
tālimi sesugŏṁṭim̐ danisidive
(||ela||)
rānīve ādam̐ḍu meralu dappam̐ḍanevu
kānīve nīvemi kallalāḍevā
ponīvu yĕṁtainam̐ boyina suddulu nīvu
yīnijame kalide ninniyu mĕchchene
(||ela||)
paṭṭinīve nāsĕram̐gu battigalam̐ ḍanevu
aṭṭĕ yavune nī vaṁtadānavu
gaṭṭisese vappaḍini kappi tŏlliḍibāsalu
suṭṭugŏṁṭe valabulu sulabha mayyīne
(||ela||)
sĕppanīve priyamulu sevagu mĕchchĕnanevu
sippila nīve māgum̐ jĕligattĕvu
yippuḍĕ śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nannum̐ garuṇiṁchi
vŏppugŏṁṭe manasulu vŏkkaḍe yayyīne