ఏల సాములు సేసే వింతితోడను
(॥పల్లవి॥)
ఏల సాములు సేసే వింతితోడను
జాలిఁబెట్ట కిఁక మోవిచవు లియ్యరాదా
(॥ఏల॥)
బాయిటఁ బవ్వళించి పడఁతిచన్నులు నీవు
చేయిచాఁచి పిసికేవు సిగ్గువడఁగా
రాయిడేల చేసే వారయ రాలవంటివి
వేయైన నీచేతులకు వెనకతీసీనా
(॥ఏల॥)
యేఁకటతోఁ బానుపుపై యిరవైవుండినయింతి
పోఁకముడి విడిచేవు పొరలఁగాను
వేఁకపువలపులకు వేసినముడియ ఇది
తేఁకువ నీచేఁతలతో దీకొనీనా
(॥ఏల॥)
మాఁగినమోవితోడ మంతనాన వున్న సతిఁ
గాఁగిటనే కుచ్చేవు కడునవ్వఁగా
దాఁగరానిచోటది తమితో శ్రీవేంకటేశ
పాఁగిననీయాసలకు పంతమిచ్చీనా
(||pallavi||)
ela sāmulu sese viṁtidoḍanu
jālim̐bĕṭṭa kim̐ka movisavu liyyarādā
(||ela||)
bāyiḍam̐ bavvaḽiṁchi paḍam̐tisannulu nīvu
seyisām̐si pisigevu sigguvaḍam̐gā
rāyiḍela sese vāraya rālavaṁṭivi
veyaina nīsedulagu vĕnagadīsīnā
(||ela||)
yem̐kaḍadom̐ bānububai yiravaivuṁḍinayiṁti
pom̐kamuḍi viḍisevu pŏralam̐gānu
vem̐kabuvalabulagu vesinamuḍiya idi
tem̐kuva nīsem̐talado dīgŏnīnā
(||ela||)
mām̐ginamovidoḍa maṁtanāna vunna sadim̐
gām̐giḍane kuchchevu kaḍunavvam̐gā
dām̐garānisoḍadi tamido śhrīveṁkaḍeśha
pām̐ginanīyāsalagu paṁtamichchīnā