Ela saagiruluvettee nemi meedom jeppeeni

ఏల సాకిరులువెట్టీ నేమి మీతోఁ జెప్పీని
Language

(॥పల్లవి॥)
ఏల సాకిరులువెట్టీ నేమి మీతోఁ జెప్పీని
జాలిలేక తానే చక్కజాడ నుండరాదా

(॥ఏల॥)
ఆఱడిగా కేకతానే ఆలుమగఁ డుండఁ గాను
వేఱొకతె వచ్చితేనే వీరిడి గాదా
జాఱక తమలోనను జాణతనాలాడఁగాను
తూఱి తాను నవ్వఁబోతే దొమ్మి సేయకుందురా

(॥ఏల॥)
పడఁతియుఁ బురుషుఁడు పైకొనొ మాటలాడఁగ
యెడచొచ్చి మాటలాడే దెడ్డగాదా
అడియాలముగ వారు ఆయములు చెనకఁగా
కడనుండి తా నంటితే కడుఁగూళ గాదా

(॥ఏల॥)
శ్రీవేంకటేశుఁడు నన్ను చేకొని కూడుండఁగ
భావించి వింతది చూడఁ బాడియవునా
పూవువలెఁ దొల్లి తాను పొందుగలదిగనక
ఆవేళఁ దా నొరసితే నంగవించకుందురా

(||pallavi||)
ela sāgiruluvĕṭṭī nemi mīdom̐ jĕppīni
jālilega tāne sakkajāḍa nuṁḍarādā

(||ela||)
āṟaḍigā kegadāne ālumagam̐ ḍuṁḍam̐ gānu
veṟŏgadĕ vachchidene vīriḍi gādā
jāṟaga tamalonanu jāṇadanālāḍam̐gānu
tūṟi tānu navvam̐bode dŏmmi seyaguṁdurā

(||ela||)
paḍam̐tiyum̐ buruṣhum̐ḍu paigŏnŏ māḍalāḍam̐ga
yĕḍasŏchchi māḍalāḍe dĕḍḍagādā
aḍiyālamuga vāru āyamulu sĕnagam̐gā
kaḍanuṁḍi tā naṁṭide kaḍum̐gūḽa gādā

(||ela||)
śhrīveṁkaḍeśhum̐ḍu nannu segŏni kūḍuṁḍam̐ga
bhāviṁchi viṁtadi sūḍam̐ bāḍiyavunā
pūvuvalĕm̐ dŏlli tānu pŏṁdugaladiganaga
āveḽam̐ dā nŏraside naṁgaviṁchaguṁdurā