Ela saagiri gorevu yimtalo nannu

ఏల సాకిరి గోరేవు యింతలో నన్ను
Language

(॥పల్లవి॥)
ఏల సాకిరి గోరేవు యింతలో నన్ను
ఆలరి సతులకు నీ కమరుగాక

(॥ఏల॥)
నిగ్గులమాట లాడ నీతో నే నేరుతునా
సిగ్గువడియుండేటిచెలి నేను
కగ్గి నీవలెనే నేను కల్లలాడ నేరుతునా
మొగ్గులేనియటువంటి ముద్దరాల నేను

(॥ఏల॥)
నీవునేరనిచేఁతలు నే నేరుపఁగలనా
వావితో లోనుండేరాణివాసమ నేను
వోవరిలో నీసుద్దులు వూఁకొన నేఁ గలనా
కోవిలకూఁత కుత్తిక కోమలిని నేను

(॥ఏల॥)
జంకించి కాఁగిటఁ గూడేచలమరిదాననా
వంకలాడ నేరిచినవనిత నేను
అంకెల శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
పొంకమై కలసితివి పొందనేర్తు నేను

(||pallavi||)
ela sāgiri gorevu yiṁtalo nannu
ālari sadulagu nī kamarugāga

(||ela||)
niggulamāḍa lāḍa nīdo ne nerudunā
sigguvaḍiyuṁḍeḍisĕli nenu
kaggi nīvalĕne nenu kallalāḍa nerudunā
mŏgguleniyaḍuvaṁṭi muddarāla nenu

(||ela||)
nīvuneranisem̐talu ne nerubam̐galanā
vāvido lonuṁḍerāṇivāsama nenu
vovarilo nīsuddulu vūm̐kŏna nem̐ galanā
kovilagūm̐ta kuttiga komalini nenu

(||ela||)
jaṁkiṁchi kām̐giḍam̐ gūḍesalamaridānanā
vaṁkalāḍa nerisinavanida nenu
aṁkĕla śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
pŏṁkamai kalasidivi pŏṁdanerdu nenu