Ela saadimcheem daanu yeramgami sesugoni

ఏల సాదించీఁ దాను యెరఁగమి సేసుకొని
Language

(॥పల్లవి॥)
ఏల సాదించీఁ దాను యెరఁగమి సేసుకొని
వాలాఇంచి ఆ సుద్దులు వా(వ్రా?)సితినే నేను

(॥ఏల॥)
మూలనుండి తనతోను ముచ్చటకే యాడుకోఁగా
ఆలకించి వింటినే యపుడే నేను
కేలిసలుపుచు లోలోఁ గిలకిలనవ్వుకోఁగా
వోలిఁ దమవాకిటనే వుండితినే నేను

(॥ఏల॥)
పట్టె మంచముపైఁ దాము పండుండఁగాఁ జెలులను
అట్టె సాక్షిపెట్టితినే యపుడు నేను
దిట్టలై నెరులు చిక్కుదీసుకోఁగా నాడ కేఁగి
గుట్టున నెఱుకసేసుకొంటినే నేను

(॥ఏల॥)
రంగుగఁ దామిద్దరును రతుల నలయఁగాను
అంగములు ముట్టితినే యపుడు నేను
అంగవించి శ్రీవేంకటాధీశుఁడె నన్నుఁగూడె
సంగడి సేసలు పైపైఁ జల్లితినే నేను

(||pallavi||)
ela sādiṁchīm̐ dānu yĕram̐gami sesugŏni
vālāiṁchi ā suddulu vā(vrā?)sidine nenu

(||ela||)
mūlanuṁḍi tanadonu muchchaḍage yāḍugom̐gā
ālagiṁchi viṁṭine yabuḍe nenu
kelisalubusu lolom̐ gilagilanavvugom̐gā
volim̐ damavāgiḍane vuṁḍidine nenu

(||ela||)
paṭṭĕ maṁchamubaim̐ dāmu paṁḍuṁḍam̐gām̐ jĕlulanu
aṭṭĕ sākṣhibĕṭṭidine yabuḍu nenu
diṭṭalai nĕrulu sikkudīsugom̐gā nāḍa kem̐gi
guṭṭuna nĕṟugasesugŏṁṭine nenu

(||ela||)
raṁgugam̐ dāmiddarunu radula nalayam̐gānu
aṁgamulu muṭṭidine yabuḍu nenu
aṁgaviṁchi śhrīveṁkaḍādhīśhum̐ḍĕ nannum̐gūḍĕ
saṁgaḍi sesalu paibaim̐ jallidine nenu