ఏల రేఁచీ నన్ను నింత యేమనినా వెగటౌను
(॥పల్లవి॥)
ఏల రేఁచీ నన్ను నింత యేమనినా వెగటౌను
గాలి మూటగట్టఁబోతే కడు నవ్వుఁబాట్లు
(॥॥)
మారుమాట లాడఁబోతే మనసునొచ్చీఁదనకు
కేరికేరి నవ్వఁబోతే కేరడమౌను
తారుకాణించఁగఁబోతే తనకుఁ గొరఁతవచ్చు
నేరనైతి నాఁడే నాఁడే నిజము నిష్టూరము
(॥॥)
కనుఁగవ నవ్వఁబోతే కడువెంగెమౌఁదనకు
కొనగోర నంటఁబోతే కోపమునౌను
చనవునఁ దిట్టఁబోతే జగడాలు ముదురును
వినకున్నాఁజెప్పఁబోతే విందువెట్టీఁ బగలు
(॥॥)
కదిసి మోవడిగితే గట్లు తనకు రాఁగు
పదరి కాఁగిలించితే పచ్చిదేరును
అదన శ్రీవేంకటేశుఁ డంగవించి నన్నుఁగూడె
అద నెరిఁగినయడు గడుగే నిక్షేపము
(||pallavi||)
ela rem̐sī nannu niṁta yemaninā vĕgaḍaunu
gāli mūḍagaṭṭam̐bode kaḍu navvum̐bāṭlu
(||||)
mārumāḍa lāḍam̐bode manasunŏchchīm̐danagu
kerigeri navvam̐bode keraḍamaunu
tārugāṇiṁcham̐gam̐bode tanagum̐ gŏram̐tavachchu
neranaidi nām̐ḍe nām̐ḍe nijamu niṣhṭūramu
(||||)
kanum̐gava navvam̐bode kaḍuvĕṁgĕmaum̐danagu
kŏnagora naṁṭam̐bode kobamunaunu
sanavunam̐ diṭṭam̐bode jagaḍālu mudurunu
vinagunnām̐jĕppam̐bode viṁduvĕṭṭīm̐ bagalu
(||||)
kadisi movaḍigide gaṭlu tanagu rām̐gu
padari kām̐giliṁchide pachchiderunu
adana śhrīveṁkaḍeśhum̐ ḍaṁgaviṁchi nannum̐gūḍĕ
ada nĕrim̐ginayaḍu gaḍuge nikṣhebamu